*రైతులు పొలాల్లో జీలుగ సాగుచేస్తే భూసారం పెరుగుతుంది:వ్యవసాయ శాఖ*

 పెబ్బేరు మండలం సుగూరు
 గ్రామంలో మండల వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పచ్చిరొట్ట పంటలపై మరియు  భాస్వరం ఎరువుల గురించి రైతులకు అవగాహన  సదస్సు ఏర్పాటు చేశారు. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో నేల చాలావరకు భూసారం తగ్గిందని తెలిపారు. మరియు సేంద్రీయ కర్బనం శాతం తక్కువగా ఉంది కాబట్టి   ప్రతి రైతు తన పొలంలో జీలుగ   వేసుకోవాలని సూచనలు ఇచ్చారు. జీలుగ పూత దశలో దున్నడం వల్ల నేల కు కావాల్సిన పోషకాలు అందడమే కాకుండా నేల యొక్క చౌడు గుణాలు కూడా తగ్గిస్తుంది. మరియు భాస్వారపు జీవన ఎరువుల గురించి  కూడా రైతులకు తెలియజేయడం జరిగింది. నేలలో లభ్యంకాని భాస్వరపు రూపాన్ని కరిగించి ఉపయోగపడే రీతిలో మార్చడానికి కొన్ని సూక్ష్మజీవులు ధోహ పడతాయని తెలిపారు.   వీటినే   భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువులు అంటారు. ఈ భాస్వరాన్ని కరిగించే జీవన  ఎరువులను  వాడినప్పుడు భూమిలో నిరుపయోగంగా ఉన్న భాస్వరం లభ్యమౌతుంది. కాబట్టి పైపాటుగా డి.ఎ.పి గాని భాస్వరం కలిగిన  కాంప్లెక్స్ లను గాని తగించవచు.అని రైతుల కు తెలియజేయడం జరిగింది.
ప్రతి రైతు వినియోగించుకోవాలని అదేవిధంగా రైతు సోదరులకు మిరపలో విత్తనాలు  వచ్చు  వైరస్ తెగులు నివారణకు గాను విత్తన శుద్ధి చేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచించడం జరిగింది  దీని గాను 150 గ్రామ ట్రై సోడియం ఆర్థో ఫాస్పేట్ మరియు క్యాప్టెన్ మూడు గ్రాములు విత్తనానికి పట్టించలని , మిరప నారు పోసుకున్న ప్రదేశంలో  ఫీప్రొనిల్ గుళికలు వేసుకోవాలని సూచించారు.అదేవిధంగా ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చినటువంటి వ్యవసాయ దీపికలను గ్రామ సర్పంచ్ యొక్క ఆధ్వర్యంలో రైతులకు అందజేశారు. అదేవిధంగా వానకాలం  2022 కొత్తగా పట్టాదార్ పాస్ బుక్ వచ్చిన రైతు సోదరులు రైతు బంధు దరఖాస్తు చేసుకోవాలని తెలియచేశారు. కార్యక్రమంలో  వ్యవసాయ విస్తరణ అధికారి A.బిందు,పాత సుగూరు సర్పంచ్ జూదం వెంకటేష్  మండగిరి వెంకటయ్య,  రైతు కోఆర్డినేటర్, B.జయన్న ,రైతు కోఆర్డినేటర్, s. షణ్మీకి, G .పరుషరముడు  తదితరులు పాల్గొన్నారు.