రైతుల ఆత్మహత్యలొద్దు.. అన్ని విధాల ఆదుకుంటాం

2

మంత్రి పోచారం
హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 2 (జనంసాక్షి):రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని అన్ని విధాలుగా రైతులను ఆదుకోంటామని, గత ప్రభుత్వాలు చేయని పనులు మా ప్రభుత్వం చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. లక్ష రూపాయల వరకు రైతు రుణాలు మాఫీ చేసిన ఘనత తమదన్నారు. సచివాలయంలో బుధవారం ఆయన మిడియాతో మాట్లాడారు.  రైతు రుణాలు వడ్డీతో సహా మాఫీ చేశామని, రూ.లక్ష వరకు రుణం తీసుకున్న రైతు సకాలంలో చెల్లిస్టే వడ్డీ లేని రుణం. రూ. లక్ష నుంచి 3 లక్షల వరకు రుణం తీసుకున్న రైతులకు పావలా వడ్డీ వర్తిస్తుందని వెల్లడించారు. రైతుల ఆత్మహత్యలు బాధాకరమన్నారు. . రైతుల ఆత్మహత్యలను నివారిస్తామన్నారు.  రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి ప్రకటించారు. రైతులు ధైర్యం కోల్పోవద్దన్నారు. విపక్షాలు విమర్శలు మానాలన్నారు. నేటి ఈ దుస్థితికి కారణం వీరు కాదా అని ప్రశ్నించారు.