రైతుల పక్షపాతి తెదేపా ప్రభుత్వం

– మంత్రి సంజయ కృష్ణ
– లోచెర్లలో ఎత్తిపోతల పథక శిలాఫలకాన్ని ప్రారంభించిన మంత్రి
విజయనగరం,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): రైతుల అభ్యున్నతే లక్ష్యంగా తెదేపా ప్రభుత్వం పనిచేస్తుందని, రైతులకు అన్నివిధాలుగా అండగా నిలుస్తూ ఆర్థిక బలోపేతానికి కృషి చేస్తున్నట్లు  భూగర్భ గనుల శాఖ మంత్రి సుజయకృష్ణ రంగారావు అన్నారు. శుక్రవారం లోచెర్ల గ్రామంలో ఎత్తిపోతల పథకము శిలాఫలకంను
మంత్రి తన చేతులు విూదగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సంజయ కృష్ణ మాట్లాడుతూ..  గత ప్రభుత్వం నాయకులకు ఇక్కడి ప్రజలు, రైతులు పలుమార్లు వినతులు ఇచ్చిన పట్టించుకోలేదన్నారు. రైతులను అన్నివేళలా పట్టించు కొనేది తెలుగుదేశం ప్రభుత్వమన్నారు. టెండర్లను త్వరితగతిన పిలిచి పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ పథకానికి సుమారు 17కోట్లు ఖర్చు
అవుతుందన్నారు. ఈ పధకం ప్రారంభమైతే లోచెర్ల, అమిటీ, కవిరాయుని వలస, కె. సీతారాంపురం రెవిన్యూ లోని భూములు 1732 ఎకరాలకు సాగునీరు అందించవచ్చును అని అన్నారు.  అంతేకాక రాష్ట్రంలోని రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా అండగా నిలిచేందుకు తెదేపా ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందన్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్ల కాలంలో రాష్ట్రంలో ఇబ్బందుల్లో ఉన్నా రైతుల అభ్యున్నతి కోసం ఎక్కడా వెనకడుగు వేయలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రుణమాఫీ చేస్తున్నామన్నారు. అవసరమున్న చోట ప్రాజెక్టుల నిర్మాణాలు చేపడుతూ రాష్ట్రంలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందించేలా చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు. రాబోయే కాలంలో ఏపీ రైతులను దేశానికే ఆదర్శంగా నిలిచేలా తీర్చిదిద్దుతామన్నారు. దీనిలో భాగంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రభుత్వం అమల్లోకి తెస్తుందన్నారు. ఈ పథకం ద్వారా ప్రతీ రైతు కుటుంబానికి ఏడాదికి రూ. 10వేలు అందించడం జరుగుతుందన్నారు. రైతులంతా తెదేపా పక్షానే ఉన్నారని, రాబోయే ఎన్నికల్లోనూ తెదేపా అధికారంలో వస్తుందని, రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రీజినల్‌ ఆర్‌.టీ. సి చైర్మన్‌ తెంటు. లక్ష్మునాయుడు, స్టేట్‌ ్గ/నాన్స్‌ మెంబెర్‌ తూముల భాస్కరరావు, ఉపాధిహావిూ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ బి. రాజగోపాల్‌, ఏ. పి.ఎస్‌. ఐ. డి. సి  ఈఈ కె.సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు