రైతుల భూములే బంగారం

4

– హక్కులడిగితే చితకబాదుతారా?

– బృందాకారత్‌

హైదరాబాద్‌,జులై 26(జనంసాక్షి):మల్లన్న సాగర్‌ భూముల వ్యవహారంపై సిపిఎం భగ్గుమంది. నిర్వాసితులకు అండగా ఉండి పోరాడుతామని ప్రకటించింది.  కేసీఆర్‌ ప్రభుత్వం భూములు లాక్కోవడం ద్వారా బంగారు తెలంగాణ సాధించలేదని సీపీఎం జాతీయ నేత బృందా కారత్‌ విమర్శించారు. భూ నిర్వాసితుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ధర్నాచౌక్‌ వద్ద ఏర్పాటు చేసిన మహాధర్నాలో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, భూ నిర్వాసితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా బృందా కారత్‌ మాట్లాడుతూ వన్‌ టూ త్రీ జీవో చీకటి జీవో అని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ తన కళ్ల జోడును మార్చుకొని వాస్తవాలను చూడాలని విమర్శించారు. అన్యాయాన్ని ప్రశ్నించిన వారిపై తెలంగాణ ప్రభుత్వం దాడులకు పాల్పడుతోందని బృందాకరత్‌ అన్నారు. హక్కుల కోసం పోరాడుతున్న ఈ మహాధర్నాలో పాల్గొని ..విూతో పాలుపంచుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా వుందన్నారు. భూమికోసం,భుక్తికోసం పోరాడుతున్న హక్కుదాలకు అభినందనలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే చాలా రికార్డులు సృష్టించారు. వాటి గురించి నేను మాట్లాడదలచుకోలేదు కానీ.. ఓట్లు వేసి అధికారాన్ని కట్టబెట్టిన అమాయక ప్రజలపై లాఠీ చార్జ్‌ చేయించిన ఘతన మాత్రం కేసీఆర్‌ రికార్డు సృష్టించిన రికార్డు మాత్రం కేసీఆర్‌ కు మాత్రమే దక్కిందని విమర్శించారు. అమాయకులపై లాఠీ చార్జ్‌ చేసిన దారుణాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మహిళలని కూడా చూడకుండా అమానుషంగా లాఠీ చార్జ్‌ చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆమె డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ తన నివాసం చుట్టూ పోలీసు పఠాలాన్ని కాపలాపెట్టుకుని కేసీఆర్‌ పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. అమాయక ప్రజలపై తెలంగాణ ప్రభుత్వం అన్యాయంగా దాడులకు పాల్పడుతోందన్నారు. పోలీసులను ఉసిగొలిపి దాడులు చేయించి ఉద్యమాలను ఆపలేరని హెచ్చరించారు. భూసేకరణ చేయటానికి దొడ్డిదారిన వెళ్ళటానికి 123 చట్టాన్ని ఉపయోగించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం యత్నిస్తోందని ఆమె తెలిపారు. మేం అభివృద్ధికి వ్యతిరేకంగా కాదనీ..బాధితులకు సరైన న్యాయం చేసేంతవరకూ ఈ పోరాటం ఆగదని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు..ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు వారి కష్టాలను తొలగించటానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోకపోగా,  ప్రశ్నించిన వారిపై దాడులకు దిగుతోందన్నారు. ప్రజలు పోరాడి సాధించుకున్న భూ హక్కులకు ప్రభుత్వం తూట్లు పొడుస్తోంన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే మహిళలపై లాఠీ చార్జ్‌ చేయటం అమానుషమన్నారు. నరేంద్ర మోడీ ఏజెంట్‌ లాగా కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలకు 25ఏళ్ళు వచ్చాయని కేంద్ర ప్రభుత్వం సంబరాలు జరుపుకుంటున్నాయనీ..దీని వల్ల ప్రజలకు ఏం ప్రయోజనం జరిగిందో ప్రశ్నించుకోవాల్సిన అవసరముందన్నారు. బంగారు తెలంగాణ కావాలని ఉద్యమాలలో పాల్గొని లాఠీ దెబ్బలు తిని ..ఉద్యమాలలో పాల్గొని నానా హింసలు అనుభవించిన మాకు కేసీఆర్‌ మానోట్లో  మన్ను పోస్తున్నాడని భూనిర్వాశిత బాధితురాలు తన ఆవేదనను వ్యక్తం చేశారు. తాను బంగారు కంచంలో బంగారాన్ని తినే కేసీఆర్‌ మానోట్లో మట్టికొడుతున్నాడని పేర్కొంది. మాకు ఏ ప్రాజెక్టులూ అవసరం లేదనీ..మా ఊర్లో మమ్మల్ని వుండినిచ్చి..మా బ్రతులు మమ్మల్ని బ్రతనిస్తే మాకు అంతకంటే ఏవిూ అవరసరం లేదని ఆమె ఈ సందర్భంగా కోరుకుంది. లాఠీలు తూటాలు సీపీఎం పార్టీకి కొత్తేవిూ కాదన్నారు. తుపాకి తూటాలకు ఎదురెల్లి ఉద్యమాలు చేసిన ఘటన సీపీఎం పార్టీదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు.  ఇది రాజకీయ పార్టీల ధర్నా కాదని తమ్మినేని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టుల నేపథ్యంలో చేస్తున్న అన్యాయంగా చేస్తున్న  భూసేకరణకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో అన్యాయానికి గురవుతున్న బాధితులను పరామర్శించటానికి కూడా ప్రభుత్వం అడ్డుకుంటోందని విమర్శించారు. ఎంపీగా విధులు నిర్వహించినా తాను..జడ్జిగా న్యాయవ్యవస్థలో అత్యంత కీలకమైన న్యాయసేవలు అందించి చంద్రకుమార్‌ కూడా బాధిత ప్రాంతానికి చేరుకోవటానికి దొంగల్లాగా వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ముచ్చర్లలో ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందన్నారు. అభివృద్ధికి మేం వ్యతిరేకంగా కాదనీ ఆయన మరోసారి స్పష్టం చేశారు. చట్టప్రకారం భూ నిర్వాశితులకు న్యాయం జరిగేవరకూ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. భూపోరాట సమితి నాయకులు చాడ వెంకట్‌ రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం,10 వామపక్ష నాయకులు,మేధావులు పాల్గొన్నారు.