రైతు సంక్షేమంలో దీర్ఘకాలిక ప్రయోజనాలు : తుల ఉమ

కరీంనగర్‌,మే14(జ‌నం సాక్షి): సీఎం కేసీఆర్‌ రైతులకు రెండు పంటలకు పెట్టుబడులను ఇస్తానని ప్రకటించడంతో  అన్నదాతల్లో ఉత్సాహం నెలకొందని జడ్పీ ఛైర్‌పర్సన్‌ తుల ఉమ అన్నారు.  రైతులకు సంబంధించి దీర్ఘకాలిక ప్రయోజనాలు లక్ష్యంగా తెలంగాణలో కార్యాక్రమాలు చేస్తున్నారని అన్నారు. రైతాంగాన్ని  అధిక సంఖ్యలో చైతన్య పరచి అభివృద్ది చేసేందుకు సిఎం చేస్తున్న కృషిని పట్టించుకోని విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. మిర్చికి మద్దతు ధరలు ఇచ్చి కొనుగోలు చేయించే బాధ్యత కేంద్రానిదన్నారు. కానీ బిజెపి నాయకులు ఇదేవిూ తెలియనట్లు నటిస్తున్నారని అన్నారు. తెరాసకు, తెలంగాణ ఉద్యమానికి మొదటి నుంచి ఊపిరిపోసిన  ప్రజలు ఇటీవల ఓరుగల్లులో జరిగిన తెరాస ఆవిర్భావ సభకు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ మద్దతు తెలిపారన్నారు. దీనిని జీర్ణించుకోలేని కాంగ్రెస్‌, టిడిపిలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు. రాష్ట్ర సాధన అనంతరం అధికారంలోకి వచ్చిన తెరాస పార్టీ ఊహించని విధంగా అన్ని నియోజవర్గాల అభివృద్దిక చర్యలు తీసుకుంటోందన్నారు.  మొదటి నుంచి పార్టీ ఎమ్మెల్యేలు, గ్రామ, మండల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులను ముందుండి నడిపించి సఫలీకృతులయ్యారు. దీంతో టిఆర్‌ఎస్‌ గ్రామస్థాయి నుంచి బలోపేతం కావడంతో పార్టీలకు నిద్ర పట్టడం లేదని ఉమ అన్నారు. 
……………..