రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

– రైతు బీమాను అర్హులైన ప్రతి రైతుకు అందిస్తాం

– రెండు నెలల్లో ఎల్లంపల్లి, మిడ్‌మానేరుకు నీళ్లు

– ప్రతి ఇంటికి మిషన్‌ భగీరథ నీరు

– నకిలీ పురుగు మందులు, విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

– నాలుగేళ్లలో ఎంతో అభివృద్ధి చేశాం

– అడ్రస్సు గల్లంతవుతుందోనని ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయి

– విలేకరుల సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్‌

కరీంనగర్‌, జూన్‌18(జ‌నం సాక్షి) : రైతుల సంక్షేమమే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం ముందుకు సాగుతుందని, దేశంలోనే మొట్టమొదటి సారిగా 17000కోట్లు మాఫీ చేసిన ప్రభుత్వం మాది అని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. సోమవారం కరీంనగర్‌లో విూడియాతో మాట్లాడారు. ఏనాడు కూడా రైతులకు ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున మాఫీ జరగలేదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 24గంటల ఉచిత విద్యుత్‌ ఇచ్చే రాష్ట్రం కూడా తెలంగాణెళినన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఈ విధానం లేదని అన్నారు. అదేవిధంగా సంవత్సరానికి రూ. 8వేలు ఇచ్చిన ప్రభుత్వం మాదేనన్నారు. గ్రావిూణ ప్రాంతాల్లో వివిధ రకాలుగా రైతులు ప్రమాదంతో మరణిస్తున్నారని, అందుకే వారి కోసం ప్రమాద బీమా పథకం క్రింద రూ.5లక్షలు అందించాబోతున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ సంబంధించి ఆగస్ట్‌ లో ఎత్తిపోతల ద్వారా కరీంగర్‌, న ల్గొండ, వరంగల్‌ కు సాగు నీరు అందిస్తామని ఈటెల తెలిపారు. రైతుల కొరకు పెద్ద ఎత్తున గోదాముల నిర్మాణం చేపట్టామని, కరీంనగర్‌ సీడ్‌, రైస్‌, బొలే ఆఫ్‌ తెలంగాణ ఉందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఏ పని కూడా పూర్తిగా అమలు చేయలేదన్న ఈటల తెరాస హయాంలో నాలుగేళ్లలోనే అద్భుతంగా పనులు పూర్తి చేయటం జరుగుతుందన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా ఈ నెల చివరి వరకు బల్క్‌ వాటర్‌ సప్లయ్‌ చేయబోతున్నామని ఈటల పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో, పట్టణంలో సీసి రోడ్స్‌ వేశామని, అభివద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని అన్నారు. వైద్యం, విద్య విషయంలో ఎంతో ఖర్చు చేశాంమన్నారు. ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో ప్రజలకు అనుగునంగా తీర్చిదిద్దబోతున్నామని ఈటెల తెలిపారు. మనైర్‌ రివర్‌ ఫ్రంట్‌ పనులు జరుగుతున్నాయని, ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా.. కేసీఆర్‌ ఆధ్వర్యంలో అభివృద్ధే లక్ష్యంగా పోతున్నామరు. కరీంనగర్‌ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఈటల తెలిపారు. కల్తీ, ఎరువులు,విత్తనాలు అమ్మితే కటిన చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా టాస్క్‌ ఫోర్స్‌ సిబ్బంది దాడులు నిర్వహిస్తున్నారని అన్నారు. రానున్న కాలంలో మరిన్ని అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని, ప్రతిపక్షాలు తమ అడ్రస్సు ఎక్కడ గల్లంతవుతుందోనని భయాందోళన చెందుతున్నారని ఈటల అన్నారు.