రైతు సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యం

– రైతుబీమా దేశానికే ఆదర్శం

– రంగారెడ్డి జిల్లాను పరిశ్రమల హబ్‌గా మారుస్తాం

– మంత్రి మహేందర్‌ రెడ్డి

– నార్సింగి మార్కెట్‌ అభివృద్ధికి కృషిచేస్తాం

– మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌

రంగారెడ్డి, జూన్‌18(జ‌నం సాక్షి) : రైతు బిడ్డగా, పక్షపాతిగా సీఎం కేసీఆర్‌ రైతాంగానికి అవసరమైన లక్షలాది ఎకరాలకు సాగునీరు, ఎకరాకు రూ. 4 వేల పెట్టుబడులు ఇస్తున్నారని మంత్రి మహేందర్‌ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్‌ నియోజకవర్గంలో మంత్రి మహేందర్‌ రెడ్డి, మండలి చైర్మన్‌ స్వామి గౌడ్‌ పర్యటించారు. రూ. 35 లక్షలతో నిర్మించిన మార్కెట్‌ కమిటీ నూతన భవనంను మంత్రి ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ… కొత్తగా జిల్లాలో మూడు మార్కెట్‌ కమిటీల ఏర్పాటు చేశామని, ప్రతీ రైతుకు మద్దతు దరలు అందిస్తున్నామన్నారు. రూ. 12 వేల కోట్లతో పెట్టుబడులు అందించామని, సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తున్న రైతు బీమా పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రంగారెడ్డి జిల్లాలో నూతన పరిశ్రమల స్థాపనకు మంత్రి కేటీఆర్‌ సహకారంతో హబ్‌ గా మారుస్తామన్నారు.అనంతరం స్వామి గౌడ్‌ మాట్లాడుతూ.. దక్షిణ భారత దేశం లో నార్సింగి పశుల మార్కెట్‌ కు పేరుందన్నారు. నార్సింగి మార్కెట్‌ అభివృద్ధి కోసం కృషి చేస్తాం. వాతావరణం పడక, మారి పశులు ఇబ్బందులు పడుతూ పాల దిగుబడులు తగ్గుతున్నందున ఏసీ షెడ్‌ ల ఏర్పాటుకు మంత్రి హరీష్‌ రావుకు విన్నవించామన్నారు. గండిపేట – నాగోల్‌ మూసీ పరిసర పైప్‌ లైన్‌ మూసీ సుందరీకరణకు దోహదం చేస్తుంది. నార్సింగిలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస నేతలు, అధికారులు పాల్గొన్నారు.