రైతు సంఘాలు.. అనుమానించిందే నిజమయిందా?!

ట్రాక్టర్‌ పరేడ్‌ ను శాంతియుతంగా నిర్వహిస్తామని హావిూ ఇచ్చిన రైతుసంఘాలు

గణతంత్ర దినోత్సవం రోజు ట్రాక్టర్‌ పరేడ్‌ కు అనుమంతించిన ఢిల్లీ పోలీసులు

ఉద్యమాన్ని విచ్చిన్నం చేసేందుకు ర్యాలీలో విద్రోహశక్తులు చొరబడే అవకాశం ఉందని కొద్ది రోజుల ముందే అనుమానాలు వ్యక్తం చేసిన రైతు సంఘాలు

అనుమానాలను నిజం చేసేలా ర్యాలీలో ఘర్షణలు, ఎర్రకోట వైపు దారి మళ్ళిన ర్యాలీ

గాయకుడు, నటుడు ‘దీప్‌ సిద్దు’ పైన అనుమానాలు

2019 లోక్‌ సభ ఎన్నికల్లో గురుదాస్‌ పూర్‌ బీజేపీ అభ్యర్థి తరపున ప్రచారం చేసిన దీప్‌ సిద్దు

ప్రధాని మోడీ, ¬మ్‌ మంత్రి అమిత్‌ షా లతో దీప్‌ సిద్దు సన్నిహితంగా ఉన్న ఫోటోలు వైరల్‌ కావడంతో పెరుగుతున్న అనుమానాలు

న్యూేఢిల్లీ,జనవరి 27  (జనంసాక్షి):

కంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త రైతు చట్టాలకు వ్యతిరేకంగా గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధాని ఢిల్లీలో రైతు సంఘాలు నిర్వహించిన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీయడం సంచలనంగా మారింది. శాంతియుతంగా ప్రారంభమైన ట్రాక్టర్‌ ర్యాలీ ముందుగా పోలీసులు అనుమతించిన మార్గంలో కాకుండా కొందరు ఆందోళనకారులు సెంట్రల్‌ ఢిల్లీ వైపు మళ్లించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్యన ఘర్షణలు చెలరేగి తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడిన విషయం విదితమే. కొందరు రైతులు ట్రాక్టర్ల ద్వారా ఎర్రకోటకు చేరుకొని గణతంత్ర దినోత్సవ రోజున జాతీయ జెండా ముందు మరో జెండా ఎగురవేయడం ఎవరూ ఊహించని పరిణామం. గణతంత్ర దినోత్సవం నాడు జరిగిన అల్లర్లపై తీవ్రంగా స్పందించిన కేంద్ర ¬మ్‌ శాఖ విచారణ కోసం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ ఐ ఏ) ను కూడా రంగంలోకి దించినట్టు సమాచారం. గత కొన్ని నెలలుగా శాంతి యుతంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న రైతు సంఘాలు ట్రాక్టర్‌ ర్యాలీని కూడా శాంతి యుతంగా నిర్వహిస్తామని ఖచ్చితమైన హావిూ ఇవ్వడంతో గణతంత్ర దినోత్సవ రోజున ర్యాలీ నిర్వహించుకోవడానికి ఢిల్లీ పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. తమ ఉద్యమం నీరుగారకుండా నెలల తరబడి ఉదృతంగా కొనసాగుతున్నందున ఉద్యమాన్ని విచ్చిన్నం చేసేందుకు ర్యాలీలో విద్రోహశక్తులు చొరబడే అవకాశం ఉందని ముందే అనుమానించిన రైతు సంఘాల నాయకులు, తగిన చర్యలు తీసుకోవాలని విలేఖరుల సమావేశంలోనే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైతు సంఘాలు ముందు అనుమానించినట్లుగానే ట్రాక్టర్‌ ర్యాలీ సమయంలో ఢిల్లీలో ఉద్రిక్తపరిస్థితులు ఏర్పడ్డాయి. ఢిల్లీ శివార్ల నుండి ఉదయం శాంతియుతంగా ప్రారంభమైన ర్యాలీని రాజపథ్‌ లో గణతంత్ర వేడుకలు ముగియకముందే అనుమతించిన మార్గాన్ని ఉల్లంఘించి సెంట్రల్‌ ఢిల్లీ వైపు మళ్లించడానికి కొందరు ఆందోళనకారులు ప్రయత్నించారు. దీనితో పోలీసులు, ఆందోళనకారుల మధ్యన ఘర్షణలు చెలరేగి తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆందోళనకారులను నిలువరించాలని పోలీసులు ఎంత ప్రయత్నించినప్పటికీ కొందరు రైతులు ట్రాక్టర్లతో సహా ఎర్రకోటకు వెళ్లి అక్కడ జాతీయ జెండా ముందు మరో జెండా ఎగురవేశారు. ఎర్రకోట ఘటనను తీవ్రంగా పరిగణించిన కేంద్ర ¬ం శాఖ విచారణ నిమిత్తం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ ఐ ఏ) ను కూడా రంగంలోకి దించినట్టు తెలుస్తోంది.ఈ ఘటనపై రైతు సంఘాలు కూడా తీవ్రంగా స్పందిస్తున్నాయి. హింసాత్మక చర్యలతో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించడం తమ లక్ష్యం కాదని రైతు సంఘాల నేతలు అంటున్నారు. తమ ఉద్యమంలో కొన్ని అసాంఘిక శక్తులు చొరబడ్డాయని వారే తమ రూట్‌ మ్యాప్‌ ను మార్చి ఎర్రకోటవైపు రైతులను ఉసిగొల్పినట్టుగా చెప్తున్నారు. కావాలనే తమ ఉద్యమాన్ని కొందరు తప్పుదోవ పట్టించారని అంటున్నారు. వారిలో ముఖ్యంగా పంజాబీ గాయకుడు, నటుడు దీప్‌ సిద్దూ పేరు అధికంగా వినిపిస్తుంది. మొదటి నుంచి రైతు ఉద్యమానికి తన మద్దతు ప్రకటించిన సిద్ధూ నిన్న ఎర్రకోట వద్ద జరిగిన అల్లర్లలో కూడా పాల్గొన్నాడు. అయితే ఎర్రకోటపై జాతీయ జెండాతో పాటుగా సిక్కు జెండాను కూడా ఎగురవేయడం వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో దీప్‌ సిద్దునే కొంత మంది యువకుల ప్రేరేపించి ఎర్రకోటను ముట్టడించాలని, సిక్కు మత జెండాని ఎగురవేయాలని ఎర్రకోట పైకి పంపినట్టుగా భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) హర్యానా విభాగం నేత గుర్నామ్‌ సింగ్‌ చౌదాని ఆరోపించారు. అనుమానిత దీప్‌ సిద్ధుతో  కొందరు బీజేపీ నేతలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, 2019 లోక్‌ సభ ఎన్నికల్లో గురుదాస్‌ పూర్‌ బీజేపీ అభ్యర్థి, బాలీవుడ్‌ నటుడు ధర్మేంద్ర కుమారుడైన సన్నీ దేవళ్‌ తరఫున ప్రచారం కూడా చేశాడని చెప్తున్నారు. దీప్‌ సిద్దు ప్రధానమంత్రి మోదీతో పాటు ¬మ్‌ మంత్రి అమిత్‌ షా తో సన్నిహితంగా కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ విూడియాలో వైరల్‌ గా మారడంతో రైతుసంఘాల అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఏదిఏమైనా భారీ భద్రతా ఏర్పాట్లు ఉండే గణతంత్ర దినోత్సం రోజున దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటం రైతుల కొనసాగిస్తున్న ఉద్యమ తీవ్రతను సూచిస్తుంది.