రోడ్డెక్కనున్న ‘కియా’ కారు

– కియా పరిశ్రమలో విడుదలకు సిద్ధమైన తొలికారు
– నేడు విడుదల చేసి, డ్రైవ్‌ చేయనున్న సీఎం చంద్రబాబు
– సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
అనంతపురం, జనవరి28(జ‌నంసాక్షి) : ఏపీలో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పరిశ్రమల్లో కియా కార్ల పరిశ్రమ ఒకటి. ఈ  కియా పరిశ్రమ నుండి తొలిసారిగా మంగళవారం కారు రోడ్డెక్కనుంది. అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన ఈ పరిశ్రమలో తొలి కారు విడుదలకు సిద్ధంగా ఉంది. అతి తక్కువ కాలంలోనే పరిశ్రమను నిర్మించిన కియా సంస్థ… ఈ యూనిట్‌ లో తయారు చేసిన కారును విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. పరిశ్రమలో తయారైన తొలి కారు ట్రయల్‌ రన్‌ కూడా పూర్తయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం తొలి కారును లాంచ్‌ చేయనున్నారు. అనంతరం సీఎం స్వగా డ్రైవ్‌ చేయనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా అనంతపురం జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
చంద్రబాబు పర్యటనలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలని ఇప్పటికే అధికారులకు కలెక్టర్‌ వీరపాండ్యన్‌ ఆదేశించారు. ఈ మేరకు ఆయన జీవీజీ అశోక్‌ కుమార్‌,అ డిషనల్‌ ఎస్‌పీ చౌడేశ్వరీలతో కలిసి కియా పరిశ్రమ ప్రతినిధులతో భద్రతా ఏర్పాట్లపై పరిశీలించారు. ముందుగా సీఎం కియాలో పర్యటించే ఎలక్ట్రికల్‌ వాహనాన్ని పరిశీలించారు. అనంతరం హెలీప్యాడ్‌ వద్ద పనులు, ట్రయల్‌ రన్‌ ప్రొడక్షన్‌లో తొలికారు ప్రారంభించే ప్రెష్‌షాపును పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. కియా పరిశ్రమలో తయారైన మొదటి కారును సీఎం చంద్రబాబు చేతుల విూదుగా ప్రారంభిస్తారని అన్నారు. టెస్ట్‌ ట్రాక్‌ విూదుగా సీఎం డ్రైవ్‌ చేస్తారని తెలిపారు.  ఇదిలాఉంటే  ప్రతి ఆరు నెలలకు ఒక కొత్త మోడల్‌ కారును మార్కెట్లోకి తెచ్చేలా కియా సంస్థ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. నేడు తొలి కారును చంద్రబాబు విడుదల చేయడమే కాకుండా… స్వయంగా నడపనుండటంతో పలు మార్లు కియా సంస్థ ప్రతినిధులు కార్‌ను ట్రయల్‌ రన్‌ నిర్వహించారు.