లాభాలతో ముగిసిన మార్కెట్లు

ముంబయి, అక్టోబర్‌15(జ‌నంసాక్షి) : దేశీయ సూచీలు లాభాలతో ముగిశాయి. సోమవారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్లు తర్వాత లాభ నష్టాలతో ఒడిదొడుకులకు గురై చివరకు లాభాలను ఆర్జించాయి. ఐటీ, ఫార్మా రంగాల షేర్లలో కొనుగోళ్లు మార్కెట్లకు కలిసొచ్చాయి. ఆటో, బ్యాంకింగ్‌ రంగ షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. ఉదయం సెన్సెక్స్‌ స్వల్ప నష్టంతో 34,729 వద్ద ట్రేడింగ్‌ ఆరంభించగా, నిఫ్టీ 10,460పైన ట్రేడింగ్‌ ప్రారంభించింది. ముగింపులో సెన్సెక్స్‌ 131.52 పాయింట్ల లాభంతో 34,865.10 పాయింట్లకు చేరింది. నిఫ్టీ 40పాయింట్ల లాభంతో 10512.50 పాయింట్లకు చేరింది. సోమవారం ఎన్‌ఎస్‌ఈలో డా.రెడ్డీస్‌ ల్యాబ్స్‌, సిఎ/-లా, ఇన్ఫోసిస్‌, ఐటీసీ, బీపీసీఎల్‌ తదితర కంపెనీల షేర్లు లాభాలను నమోదు చేశాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌యూఎల్‌, హెచ్‌పీసీఎల్‌, ఎం అండ్‌ ఎం, గెయిల్‌ తదితర కంపెనీల షేర్లు నష్టపోయాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.74.02 వద్ద ట్రేడవుతోంది.