వదలని వరుణిడితో వామప్‌ మ్యాచ్‌లకు అంతరాయం


సిడ్నీ,నవంబర్‌28(జనంసాక్షి): ఆస్టేల్రియా పర్యటనలో వరణుడితో కోహ్లీసేనకు తిప్పలు తప్పేలా లేవు. ఇప్పటికే టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో అంతరాయం కలిగించిన వర్షం తాజాగా వార్మప్‌ మ్యాచ్‌లోనూ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ముందుగా అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం బుధవారం నుంచి క్రికెట్‌ ఆస్టేల్రియా ఎలెవన్‌తో కోహ్లీసేన నాలుగు రోజుల వార్మప్‌ మ్యాచ్‌ ఆడాలి. /ూనీ, మ్యాచ్‌కు వేదికైన సిడ్నీ నగరాన్ని ప్రస్తుతం వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో మొదటి నుంచి ఈ మ్యాచ్‌ సజావుగా సాగడం అనుమానస్పదంగానే మారింది. అనుకున్నట్లుగానే మంగళవారం రాత్రి నుంచి వర్షం కురుస్తుండటంతో తొలిరోజు టాస్‌ పడకుండానే వార్మప్‌ మ్యాచ్‌ నిలిచిపోయింది. గురువారం ఉదయం వరకు వర్షం కొనసాగే అవకాశం ఉందని తెలిసింది. అయితే అదే రోజు మధ్యాహ్నం నాటికి వాతావరణం తేలికపడొచ్చని సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో మిగిలిన ఆ కాస్త ప్రాక్టీస్‌ సమయాన్ని కోహ్లీసేన వినియోగించుకుంటుందో లేదో చూడాలి.