వన్యప్రాణుల మరణాలపై నిర్లక్ష్యం తగదు

కడప,మే17(జ‌నం సాక్షి):  సిద్దవటం- అట్లూరు మార్గంలో చిన్న వన్యప్రాణి మరణించినా నిర్లక్ష్యం వహించకుండా వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం తెలపాలని కడప డీఎఫ్‌వో శివప్రసాద్‌ ఆదేశించారు. ఈ రహదారి పక్కన వన్యప్రాణులు ఎక్కువగా కన్పిస్తున్నాయని, ఈ విధంగా తాను ఎక్కడా చూడలేదని చెప్పారు. సిద్దవటం రేంజిలోని రోలబోడు అటవీ ప్రాంతంలో పునరుద్ధరిస్తున్న ఆంగ్లేయుల కాలం నాటి రోడ్డును  డీఎఫ్‌వో పరిశీలించారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న అటవీ సంపదను తిలకించారు.  సిబ్బంది తమ సమస్యలను చెబితే పరిష్కరిస్తామన్నారు.  సిద్దవటం, అట్లూరులోని పెన్నానది ప్రదేశాలు లంకమల అభయారణ్యం పరిధిలోకి వస్తాయని ఎవరైనా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.