వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు మోనో రైల్‌ ప్రాజెక్టు

1200 కోట్లతో 12 కీలోమిటర్లు నిర్మాణం

ఎంవోయు ఒప్పందం కుదిరితె 18నెలల్లో పనులు పూర్తి..

స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రతినిధులు వరంగల్లో పర్యటన ?

వరంగల్‌,జూన్‌20(జ‌నం సాక్షి): వరంగల్‌ కొత్తశోభ సంతరించుకోబోతున్నది. ప్రపంచశ్రేణి నగరాల సరసన వరంగల్‌ను నిలిపేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీసుకుంటున్న చర్యలు ఫలిస్తున్నాయి. ఇందుకు రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటిఅర్‌ ప్రత్యేక చొరవ చూపుతున్నారని, అన్నీ అనుకూలిస్తే వరంగల్‌ మహానగరంలో సవిూప భవిష్యత్‌లో మోనోరైల్‌ పరుగులు పెట్టనున్నది. హైదరాబాద్‌ తర్వత వరంగల్‌ ను అన్ని విధల అబివృద్ది చేసెందుకు సిఎం కేసిఅర్‌ ప్రత్యేక శ్రద్ద పెట్టారని, దానికి నిదర్శనమే వరంగల్‌ నగరానికి మోనోరైల్‌ ప్రాజేక్ట్‌ రాబోతోందని గ్రేటర్‌ వరంగల్‌ కార్పోరేషన్‌ మేయర్‌ నన్నపనేని నరేందర్‌ తెలిపారు. దీనిని అధ్యయనం చేసేందుకు పలు కంపనీల ప్రతినిధులు వరంగల్‌ నగరానికి వచ్చారని, వారితో వరంగల్‌ పట్టణంలో పర్యటించామని నరేందర్‌ తెలిపారు. వరంగల్‌, హన్మకొండ, కాజీపేట పట్టణాల సమాహారంగా స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రపంచప్రఖ్యాత ఇంటమిన్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ కంపెనీ మోనోరైల్‌ ప్రాజెక్టును నిర్మించేందుకు ముందుకొచ్చారు. ఎంఒయు ఒప్పందం కుదిరితె 18నెలల్లో ప్రాజేక్ట్‌ పనులు పూర్తి చేస్తారని గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌ నరేందర్‌ దీమా వ్యక్తం చేశారు. కాజీపేట నుంచి వరంగల్‌ వరకు 12 కిలోవిూటర్లకు దాదాపు రూ.1200 కోట్లతో ఈ ప్రాజెక్టుకు రూపల్పన చేశారుని తెలిపారు. చైనా, రష్యా, ఇజ్రాయెల్‌, జర్మనీ, వియత్నాం వంటి 30 దేశాల్లో విజయవంతంగా నడుపుతున్న మోనోరైల్‌ ప్రాజెక్టును.. వరంగల్‌లో ఏర్పాటుకు ఇంటమిన్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ కంపెనీ ముందుకొచ్చింది. బెంగళూర్‌ కేంద్రంగా పనిచేస్తున్న గ్లోబల్‌ స్పెక్టమ్ర్‌ సంస్థ, ఇంటమిన్‌ ట్రాన్స్‌ఫోర్టేషన్‌ బిజినెస్‌ అడ్వయిజర్‌ ఏఎన్‌ఎన్‌ సామ్రాట్‌ తన ప్రతినిధి బృందంతో కలిసి మూడునెలల కిందట వరంగల్‌ మహానగరంలో పర్యటించి ప్రతిపాదనలు రూపొందించారు. అత్యాధునిక ఫ్యాబ్రికేటెడ్‌ సాంకేతిక విధానంలో సింగిల్‌బీమ్‌లో భూసేకరణ అవసరంలేకుండా మోనోరైల్‌ నడిపేందుకు అనువైన ట్రాక్‌ నిర్మించవచ్చని భావిస్తున్నారు. వరంగల్‌ మహానగరంలో రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల విస్తరణకు శ్రీకారం చుట్టడంతో.. రోడ్‌ డివైడర్ల స్థలంలోనే సింగిల్‌ పిల్లర్‌ వేసి మోనోరైల్‌ను నడిపేందుకు అనువైన పరిస్థితులున్నాయని ఆ కంపెనీ భావించింది. ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్‌ టెక్నాలజీ తో తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రయోజనాలు వచ్చేలా ప్రాజెక్టును రూపొందించనున్నట్టు తెలుస్తున్నది. లాంఛనాలు పూర్తయ్యాక 10 నుంచి 12 నెలల వ్యవధిలో ప్రాజెక్టు సిద్ధంచేసే అవకాశాలున్నాయని గ్లోబల్‌ స్పెక్టమ్ర్‌ కన్‌స్టలెంట్‌ ప్రతినిధులు ప్రతిపాదనలు రూపొందించారు.