వరంగల్ నగరంలో భారీ అగ్నిప్రమాదంవరంగల్ నగరంలో భారీ అగ్నిప్రమాదం

వరంగల్ బ్యూరో, ఫిబ్రవరి 3 (జనం సాక్షి)వరంగల్ నగరం ఇసుక అడ్డ జంక్షన్ వద్ద శుక్రవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది స్థానిక ఓల్డ్ ఫర్నిచర్ షాపులలో చెలరేగిన మంటలు ఎగిసిపడి పక్కనే ఉన్న మెకానిక్ షాప్ తో పాటు మాధురి ఏజెన్సీస్ గోడౌన్ లో కి చొరబడి వస్తువులు కాలిపోయాయి దీంతో కోట్లాది రూపాయల నష్టం జరిగినట్టు బాధితులు తెలిపారు అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే వరంగల్ మట్టెవాడ నర్సంపేట వర్ధన్నపేట మొదలైన ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజన్లు హుటాహుటిన వచ్చి మంటలు ఆర్పినట్టు సంబంధిత అధికారులు తెలిపారు