వర్షంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం

మంచిర్యాల,జూలై21(జ‌నం సాక్షి): శ్రీరాంపూర్‌ ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్లు సింగరేణి అధికారులు తెలిపారు. ఆరు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో.. రూ. 10 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్లడించారు. లక్షా 20 వేల క్యూబిక్‌ విూటర్ల మట్టి పనులకు అంతరాయం కలిగింది. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 3.1 సెంటివిూటర్ల వర్షపాతం నమోదైంది. మందమర్రి, కల్యాణిఖని, రామకృష్ణాపూర్‌ ఉపరితల గనుల్లోనూ బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. నిన్న రాత్రి నుంచి దాదాపు 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది.

—————–