వర్షాలతో పత్తి రైతుల ఆనందం

ఖమ్మం,జూలై22(ఆర్‌ఎన్‌ఎ): దాదాపు రెండు నెలలుగా ముఖం చాటేసిన వరుణుడు గత మూడు రోజుల నుంచి కురుణ చూపించడంతో అడపాదడపా వర్షాలు పడుతున్నాయి.  దీంతో ఆయా మండలాల లో ఓ మోస్తారు వర్షం నమోదు అవుతోంది. ముఖ్యంగా పత్తి సాగు చేసిన అన్నదాతలకు ఈ వర్షాలు ఎంతో ప్రయోజనం చేకూరుస్తున్నాయి. సీజన్‌ ఆరంభం నుంచి బారీ వర్షాల కోసం ఎదరుచూస్తున్న రైతన్నలకు ఉపరితల ఆవర్తన ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు ఉపశమనం పొందుతున్నారు. వాణిజ్య పంటలు ప్రాణం పోసుకుంటుండగా, ఆరుతడి పంటలకు మంచి అనుకూల వాతావరణం ఏర్పడింది. పలు మండలాలలో ఓమోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. భూ ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న 48 గంటలలో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో రుతుపవనాలు చురుకుగా కదులుతుండడం పట్ల ఆశించిన మేర వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని సంబంధిత అధికారులు తెలిపారు.