వలసలతో నేతల్లో హుషారు

మూడు నియోజకవర్గాల్లో ప్రచార¬రు
జనగామ,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): జనగామ నియోజకవర్గంలో వలసల జోరు కొనసాగుతోంది. జనగామ, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్ఫహల, చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి మండలాల్లోని అదే విధంగా పాలకుర్తి నియోజకవర్గంలో చేరికల జోరు కొనసాగుతోంది. నియోజకవర్గంలోని పాలకుర్తి, దేవరుప్పుల, కొడకొండ్ల, పెద్దవంగర, తొర్రూరు, రాయపర్తి మండలాల నుంచి పెద్దసంఖ్యలో జనం టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు సమక్షంలో వారంతా గులాబీ కండువా కప్పుకుంటున్నారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌లో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సమక్షంలో చేరికలు కొనసాగుతున్నాయి. మూడు నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి తలపిస్తోంది. జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గ అభ్యర్థులు, మాజీ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తాటికొండ రాజయ్య ప్రజల నుంచి వస్తున్న స్పందనకు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ దెబ్బకు ప్రతిపక్షాలు బేజారవుతున్నాయని ప్రచారంలో నేతలు అంటున్నారు. కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ, ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులను ప్రకటించని కారణంగా క్యాడర్‌ ఆందోళనకు గురవుతున్నారు.కాంగ్రెస్‌ అధిష్టానం ఆయా నియోజకవర్గాల నుంచి పోటీ చేసే ఔత్సాహికులు దరఖాస్తు చేసుకోవాలని ఈ నెల 21 వరకు గడువు విధించింది. మూడు నియోజకవర్గాలకు గానూ 29 దరఖాస్తులకు పైగా వచ్చాయి. అభ్యర్థుల కోసం తీవ్రపోటీ నెలకొన్నందున మహాకూటమి నేపథ్యంలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయోనని పార్టీవర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.