వాగ్దానాలు విస్మరించిన సిఎం కెసిఆర్‌

నల్లగొండ,జూన్‌26(జ‌నం సాక్షి): సిఎం కెసిఆర్‌ నాలుగేండ్ల పాలనలో ఒక్క హావిూ కూడా నెరవేర్చలేదని రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు డా:నలగాటి ప్రసన్నరాజ్‌ అన్నారు. నిరుద్యోగ భృతి..ఉద్యోగ నియామకాలు అన్నీ బూటకమయ్యాయని అన్నారు. నకిరేకల్‌ నియోజకవర్గం కట్టంగూర్‌ లోని ఇందిరమ్మ కాలనిలో ఆయన ఇంటింటికి కాంగ్రెస్‌ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఎన్నికల ముందు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని హావిూ ఇచ్చి మోసం చేశారని అన్నారు. ఇంకా ప్రజా సంక్షేమ పథకాలు చేపడతామని చెప్పి ఆ హావిూలను విస్మరించారని అన్నారు. ప్రభుత్వ వైఫల్య పాలనను ఎండగడుతూ నకిరేకల్‌ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలతో కలసి ఆయన ఇంటింటికీ తిరి ప్రచారం చేపట్టారు.