విందు వినోదాలతో ఒకరు… ఊకదంపుడు ఉపన్యాసాలతో మరొకరు…..

 మీ వాడిగా మీ ఇంటికి ఆశీర్వాదం కోసం…
 కరీంనగర్ బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కుమార్.
    గత పదేళ్లుగా విస్మరించిన ప్రజాసంక్షేమం అభివృద్ధితో, ప్రజలతో మమేకం కాలేక విందువినోదాలతో టిఆర్ఎస్ అభ్యర్థి, గ్రూపులుగా విడిపోయిన తన పార్టీ నాయకులతో కాంగ్రెస్ అభ్యర్థి షో చేస్తున్నారని, మీ ఇంటికి వచ్చి మీ ఆశీర్వాదం కోసం నేను తపిస్తున్నానని బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కుమార్ అన్నారు.  గతంలో ఎంపీగా పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ లు ధనార్జనే ధ్యేయంగా అవినీతి అక్రమాలకు పాల్పడుతూ సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేని నిర్లక్ష్య వైఖరితో పాలన సాగించారని విమర్శించారు. అభివృద్ధి నిధులను సక్రమంగా వినియోగించకుండా నాణ్యతా ప్రమాణాలతో అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో నేడు నగరంలో, గ్రామాల ప్రధాన రహదారుల్లో దుమ్ము దూళితో ప్రజలు అవస్థ పడుతూ అనారోగ్యానికి గురై ఆస్పత్రుల పాలవుతున్నారని ఆరోపించారు. అంతేకాకుండా గతంలో నాలుగు సార్లు ఆర్బాటంగా శంకుస్థాపనలు చేసి ప్రారంభించిన నిరంతరం నీటి సరఫరా అటకెక్కడమే కాకుండా ఏడు కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. దీనితో నియోజకవర్గ ప్రజలకు కనీసం త్రాగునీరు అందులో లేని దుస్థితిలో గత పాలకులు ఉండడం దురదృష్టకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ, అమృత పథకం లో కరీంనగర్ నగరాన్ని ఎంపిక చేసినప్పటికీ టిఆర్ఎస్ ప్రజాప్రతినిధుల మధ్య మధ్య సమన్వయలోపంతో ప్రజలను నరకకూపంలోకి పడుతున్నారని బండి సంజయ్ కుమార్ విమర్శించారు. నగరంలో 32వ డివిజన్ లోని గోదాంగడ్డ ,కాశ్మీర్ గడ్డ, 22వ డివిజన్ లోని పద్మశాలివీధిలో ఇంటింటికి తిరుగుతూ ఆయన ఎన్నికల ప్రచార పాదయాత్రను నిర్వహించారు. ఈ పాదయాత్రలో బండి సంజయ్ వెంట బీజేపీ సీనియర్ నాయకులు తాళ్లపల్లి హరి కుమార్ గౌడ్, పొన్న మొండయ్య గౌడ్, చింతల శ్రీనివాస్ రెడ్డి, అందె మహేష్, బండ అనిత, ముప్పిడి సునీల్ కుమార్, రఘు, కనకరాజు, బాలరాజు, శ్రీనివాస్, , కార్ల పవన్, పసుల భాస్కర్, రాజు, రాజేందర్, భూనేష్ తదితరులున్నారు.