విజయవంతంగా రైతుబందు పథకం

కెసిఆర్‌పై భరోసాతో వ్యవసాయానికి సై అంటున్నారు
ఉత్తమ్‌ విమర్శల్లో పసలేదన్న కడియం
కాంగ్రెస్‌కు రైతు విధానమే లేదని విమర్శ
వరంగల్‌,మే18(జ‌నం సాక్షి ):  రాష్ట్రంలో రైతుబంధు పథకం విజయవంతమైందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. గత వారం రోజులులగా కార్యక్రమం సంబరంలా సాగిందన్నారు. శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ రైతుల విషయంలో పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు. రైతుల పట్ల కాంగ్రెస్‌కు సరైన విధానమేలేదన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శమని, చేతగాని దదమ్మల్లా కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. పథకాల్లో లోపాలను ఎత్తిచూపాలి తప్ప విమర్శలు చేయవద్దని కడియం శ్రీహరి అన్నారు.దేశంలోనే తొలిసారి రైతులకు పంట పెట్టుబడి సాయం అందించి తెలంగాణ రాష్ట్రం చరిత్ర సృష్టించిందని  కడియం శ్రీహరి అన్నారు. వ్యవసాయాన్ని పండగలా మార్చాలని.. రైతును రాజును చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ అనేక పథకాలు అమలుచేస్తున్నాని చెప్పారు. అన్నదాతలకు చేయూత ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంపై ప్రతిపక్ష నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
రైతులకోసం తెలంగాణ సర్కారు అనేక పథకాలు ప్రవేశపెట్టిందని బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు అమలు చేయడం లేదని కడియం ప్రశ్నించారు. పెట్టుబడి సాయంతో పరిస్థితి మారిందని, ఎక్కడెక్కడో ఉన్నవాళ్లు సొంతూళ్లకు వచ్చి మళ్లీ వ్యవసాయం చేయాలని మనసు పడుతున్నారని అన్నారు. వలసలు వాపస్‌ అయినయి. రాష్ట్రంలో సేద్యాన్ని సుసంపన్నం చేయడానికి నిత్యకృషీవలుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకొన్న ఒకే ఒక్క నిర్ణయం రైతుబంధు గ్రావిూణ ఆర్థిక వాతావరణాన్ని సమూలంగా మారుస్తున్నది. రాష్ట్ర వ్యవసాయరంగంలో సువర్ణాధ్యాయం ప్రారంభమైంది.
నిమిది రోజులపాటు ప్లలెప్లలెనా సాగిన చెక్కులు, బుక్కుల పంపిణీతో సాగుసంబురం మిన్నంటిందన్నారు.  రైతుబం ధు పథకం కింద చెక్కులు.. పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల పంపిణీకి ముందు గా నిర్ణయించిన షెడ్యూలు గురువారంతో ముగిసింది. ఇంకా పంపిణీ పూర్తికాని కొన్ని గ్రామాల్లో షెడ్యూల్‌ను పెంచుకొనే వెసులుబాటును జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం కల్పించింది. వివిధ కారణాలవల్ల ఇంకా చెక్కులు తీసుకోనివారు నెలరోజుల వరకు మండల, తహసీల్దార్‌ కార్యాలయాలలో పొందవచ్చని వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సీ పార్థసారథి తెలిపారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 735 గ్రామసభలు నిర్వహించి 3.02 లక్షల చెక్కులను పంపిణీచేశారు. ఈ నెల పది నుంచి గురువారం వరకు మొత్తం 10,052 గ్రామాలలో రైతుబంధు గ్రామసభలు నిర్వహించి సుమారు 42 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. ఎనిమిదోరోజు రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో చెక్కుల పంపిణీ కొనసాగింది. గురువారం బ్యాంకుల దగ్గర రైతుల సందడి పెరిగింది. నగదు తీసుకొని పెట్టుబడికి అప్పుచేయడం తప్పిందని రైతులంగా సంతోషం వ్యక్తంచేశారు. ఎకరానికి రూ.4 వేల పెట్టుబడి సాయం చేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
—-