విజయవాడలో నామమాత్రంగా బంద్‌

విజయవాడ,జనవరి8(జనంసాక్షి):  భారత్‌ బంద్‌ ప్రభావం విజయవాడలో నామమాత్రంగా ఉంది. పండిట్‌ నెహ్రూ బస్‌ స్టేషన్‌ ఎదుట వామపక్షాలు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు బైఠాయించి ఆందోళనకు దిగారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో భారీగా మోహరించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూశారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి అరెస్టు చేశారని సీపీఐ, సీపీఎం నేతలు రామకృష్ణ, బాబూరావు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశ వ్యాప్తంగా వామపక్షాలు, కార్మిక సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చినట్లు చెప్పారు.
/హంటూరు ఎన్టీఆర్‌ బస్టాండ్‌ వద్ద వామపక్షాల నాయకులు బస్సులను అడ్డుకున్నారు. కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థి సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి. కర్నూలు ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. దీంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే
పరిమితమయ్యాయి.
సార్వత్రిక సమ్మెలో పాల్గొన్న కార్మికులు
సార్వత్రిక సమ్మెలో భాగంగా పలు మండలాల్లో కార్మికులు పాల్గొన్నారు. కార్మికులు ర్యాలీలు నిర్వహించారు. మండల కేంద్రమైన కలకడలో జాతీయ సార్వత్రిక సమ్మెలో భాగంగా సి ఐ టి యు, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిరసన మానవహారం నిర్వహించారు. నిమ్మనపల్లిలో సార్వత్రిక సమ్మెను నిర్వహిస్తున్న సీఐటీయూ నాయకులు, కార్మిక సంఘాలు పాల్గొన్నారు.  యాదమరి ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ఎంఎ/-లాయిస్‌ లోనికి అధికారులు వెళ్లకుండా కార్మికులు,  సిఐటియు కార్మికులు అడ్డుకున్నారు. పీలేరులో నిర్వహించిన సమ్మెలో నిరసన కారులు, మహిళలు పాల్గొన్నారు.
దేశ వ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మె-రాష్ట్ర బంద్‌ తిరువూరులో బుధవారం విజయవంతంగా కొనసాగుతుంది. సిపిఎం, సిపిఐ నాయకులు, కార్యకర్తలు ఈ బంద్‌లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. షాపులు, బ్యాంక్‌లు, ప్రైవేట్‌, ప్రభుత్వ విద్యాలయాలు, కార్యాలయాలు మూతపడ్డాయి. సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులంతా బైపాస్‌ రోడ్‌ వినాయక దేవాలయం నుండి మెయిన్‌ రోడ్‌ బస్టాండ్‌ విూదుగా బోసుబమ్మ సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు.