విజయోత్సవ ర్యాలీలు నిషేధం

పంచాయితీల్లో గెలిచిన అభ్యర్థులకు సూచన

నల్లగొండ,జనవరి19(జ‌నంసాక్షి): జిల్లాలో 3 విడతలుగా జరుగనున్న పంచాయతీ ఎన్నికలు, కౌంటింగ్‌ సంబంధించి ప్రత్యే క దృష్టి సారించినట్లు ఎస్పీ ఏవీ రంగనాథ్‌ తెలిపారు. పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌ అయిన తర్వాత సర్పంచ్‌, వార్డు సభ్యులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి అనుమతి లేదన్నారు. ర్యాలీలు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. విజయం సాధించిన అభ్యర్థులు పటాకులు కాల్చడం నిషేధమన్నారు. పోలీసులు పోటీ చేసే అభ్యర్థులకు ముందస్తుగానే సమాచారం ఇవ్వాలన్నారు. ఎన్నికల పటిష్ట నిర్వాహణకు సంబంధించి సిబ్బంది కేటాయింపు పూ ర్తయిందన్నారు. ఎన్నికల సామగ్రి పో లింగ్‌ కేంద్రాలకు చేరవేయడం, పోలిం గ్‌, కౌంటింగ్‌ పూర్తయ్యే వరకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వాహనాలు తనిఖీలు చేస్తూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులతో సమన్వయం చేసుకుంటామన్నారు. మ ద్యం, డబ్బు ప్రభావాన్ని అరికట్టాలన్నారు.ఇప్పటికే జిల్లాలో పంచాయతీ ఎన్నికల దృష్ట్యా సమస్యాత్మక, అతిసమస్యాత్మక గ్రామాలను గుర్తించి ఆ గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామస్తులతో సమావేశాలు నిర్వహించామన్నారు. దేసబ్‌ డివిజన్‌ పోలీస్‌ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిష్పక్షంగా ఎన్నికల నిర్వహణతో పాటు రాజకీయాలకతీతం గా విధి నిర్వహణ చేస్తున్నామన్నారు. ఎన్నికలకు ముం దు జరిగే ఘటనల విషయంలో జాగ్రత్తగా ఉంటూ ప్రీ పోల్‌ వయోలెన్స్‌ జరుగకుండా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. గత ఎన్నికల కేసుల్లో ఉన్న వారిని, ఘర్షణకు పాల్పడే వారిని, ప్రేరేపించే వారిని గుర్తించి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. దేవరకొండ సబ్‌ డివిజన్‌ పరిధిలో కొన్ని గ్రామాలను శనివారం తాను స్వయంగా సందర్శించి ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు, భద్రత పరిశీలిస్తానని వెల్లడించారు. ఎన్నికల్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలని, సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు.