విద్యాశాఖ అధికారుల జాప్యం ఎందుకు?…కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుడు బొద్దుల నగేష్ కుమార్

ప్రైవేట్ పాఠశాల లో గల లోపాలు మరియు సమస్యలపై పలుమార్లు విద్యార్థుల తల్లిదండ్రులు వినతి పత్రాలు అందజేసినప్పటికీ ఎం ఈఓ విచారణ చేసి లోపాలు ఉన్నాయని గుర్తించినప్పటికీ చర్యలు చేపట్టడంలో జాప్యం ఎందుకని యాదాద్రి జిల్లా కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుడు బొద్దుల నగేష్ కుమార్ ప్రశ్నించారు. రాజపేట లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. రాజపేట మండలంలో గల ప్రైవేట్ స్కూల్స్ మాంటిస్సోరి స్కూల్స్, ప్రెసిడెంట్ స్కూల్స్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ సంస్థ వారు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్ పై విచారణ జరిపిన విద్యాశాఖ అధికారులు ఈ విద్య సంస్థలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. గత నాలుగు నెలలుగా విద్యాశాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్న ఎన్నో సమస్యలు వారి విచారణలో తేలిన వారిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు ఎందుకు జాప్యం చేస్తున్నారో తెలియడం లేదని కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుడు బొద్దుల నగేష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ కి, డిఇఓ నారాయణరెడ్డి కి ఎన్నిసార్లు తెలిపిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఈ సందర్భంగా వారు ప్రశ్నించారు. మా పరిధిలో లేదని ఆర్జెడి మాత్రమే వారిపై చర్యలు తీసుకుంటారని, ఆర్జెడి విజయలక్ష్మి ని అడిగితే డి ఈ ఓ కి నేను చెప్పాను. వారికి అన్ని రైట్స్ ఉన్నాయి. చర్యలు తీసుకుంటారని ఇలా ఒకరిపై ఒకరు నెట్టుకుంటూ ఇలా నిబంధనలకు విరుద్ధంగా ఎన్నో స్కూల్స్ జిల్లాలో నడుస్తున్నాయని కంప్లైంట్ ఇచ్చిన వాటిపై చర్యలు తీసుకోవడానికి సందిగ్ధంలో ఉన్న అధికారులు కంప్లైంట్స్ లేని స్కూల్ యదేచ్చగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని తెలియజేశారు. వెంటనే ఇలాంటి స్కూల్స్ జిల్లాలో ఎన్ని ఉన్నాయో తెలుసుకుని వాటిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆర్గనైజేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు బొద్దుల నగేష్ కుమార్ కోరారు