విద్యుత్‌ సమస్యకు చెక్‌ పెట్టిన తొలి సిఎం కెసిఆర్‌

నిరంతర విద్యుత్‌తో ప్రజలకు సమస్యలు దూరం చేశాం
ఇది అభివృద్ది కాదంటారా : తలసాని
హైదరాబాద్‌,మార్చి26(జ‌నంసాక్షి): నిరంతర విద్యుత్‌..కల కాదని తెలంగాణలో సిఎం కెసిఆర్‌ నిరూపించారని, దీనిని కాదని ఎవరైనా చెప్పగలరా అని మంత్రి తలసాని శ్రీనిఇవాసయాదవ్‌ ప్రశ్నించారు.
కరెంట్‌ పోతే వార్త అన్న వాదన పైకితీసుకుని వచ్చి పారిశ్రామికవేత్లకు సైతం భరోసా ఇచ్చిన ఘనత కెసిఆర్‌దని అన్నారు. పల్లెలు మొదలు పట్టణాల వరకు ఇప్పుడు నిరంతర విద్యుత్‌తో ముందుకు సాగుతున్నాయన్నారు. టైమ్‌ చూసుకుని వంటింట్లోకి వెళ్లే ఆగత్యం లేకుండా చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదని అన్నారు.  అలాగే కరెంట్‌ లేక జిరాక్స్‌ సెంటర్లు మూతపడ్డ ఘటనలు గతంలో ఉండేవి.  లాంతర్లు పట్టి నిరసనలు తెలిపే రోజులు పోయాయి. ఇలా చెప్పుకుంటూ పోతే కరెంట్‌ కథలు ఎన్నో ఉన్నాయన్నారు. తెలంగాణ ఏర్పడ్డ తరవాత కోటి ఎకరాల మాగాణంగా మార్చాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌ మదిలో రైతులకు సంబంధించిన పటిష్టమైన ఆలోచనలు రావడం స్వాగతించాలన్నారు.  విద్యుత్‌ సమస్యను అధిగమించిన తెలంగాణలో ఇటీవలే రైతులకు రెండు కార్లకు పెట్టుబడి అందించిన ఘనత కూడా సిఎం కెసిఆర్‌దేనని అన్నారు.  నిజంగానా రైతు కుటుంబాల్లో ఆశలు నింపింది. వట్టిపోయిన తెలంగాణలో వ్యవసాయాన్ని లాభదాయకం చేయడం అంత ఆషామాషీ కాదు. నదులు జీవం కోల్పోయాయి. చెరువులు ఆనవాళ్లు లేకుండా చేశారు. విద్యుత్‌ అందకుండా చేశారు. ఈ దశలో తెలంగాణ ఏర్పడ్డ నాలుగేళ్లలో అద్భుతాలు చేశారకని అన్నారు. రైతులకు 24గంటల కరెంట్‌
అందుతోంది. చెరువుల పూడికతీత ముమ్మరంగా సాగుతోంది. దీంతో చెరువుల్లో నీరుచేరి ఊళ్ళు కళకళలాడుతున్నాయి. ఇక ప్రాజెక్టుల పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇవన్నీ ఈ నాలుగేళ్లలో చేపట్టిన పనులే అన్నది గుర్తుంచుకోవాలి. నిజాయితీగానే వ్యవసాయాన్ని పండగ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామనే చెబుతున్నారు. రైతును నష్టాల ఊబిలోంచి లాగడమంటే రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడం అన్నది కెసిఆర్‌కు తెలియంది కాదన్నారు.  నిజంగా కెసిఆర్‌ ప్రకటించిన విధానాలు వ్యవ సాయాన్ని బలోపేతం చేస్తాయనడంలో సందేహం లేదన్నారు.  ప్రతి గ్రామంలో గ్రామ రైతుసంఘం ఏర్పాటు.. వీటి సమాహారంగా మండల, జిల్లా, రాష్ట్ర రైతుసంఘాలు ఏర్పరచడం, రివాల్వింగ్‌ ఫండ్‌తో రైతులకు వడ్డీలేకుండా డబ్బు గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా చేసిన ఆలోచనగా భావించాలి. కల్తీ విత్తనాలు అమ్మేవారిపై ఉక్కుపాదం మోపుతామని ప్రకటించారు. ఇంతకంటే రైతు మరేం కోరుకుంటాడని అన్నారు. విమర్శలకే ప్రతిపక్షాలు పరిమితం కారాదని, మంచిపనులను కూడా అభినందించాలని అన్నారు.  తెలంగాణను పంటల కాలనీలుగా విభజించి,ఇకపై ఏ జిల్లాలో ఏ పంటలు వేయాలో నిర్ణయిస్తామన్న ప్రకటనవల్ల అందరూ ఒకే రకమైన పంటలు వేసి నష్టపోకుండా చూడడం జరుగుతుందన్నారు. త్వరలోనే ఇది  సాకారం కానుందన్నారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గాల స్థాయి సభ 29న ఎల్‌బి స్టేడడియంలో ఏర్పాటు చేస్తున్నామని, సభకు ముఖ్యఅతిథిగా సీఎం కేసీఆర్‌ హాజరవుతారని వివరించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 15 వేల మంది సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎన్నికలకు సమయం తక్కువగా ఉండటంతో కార్పొరేటర్లు, నాయకులు ప్రణాళికతో ప్రచారం నిర్వహించాలన్నారు. మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం పార్టీ కార్పొరేటర్లను సమన్వయం చేసుకొని ప్రచారం చేయాలన్నారు. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ స్థానంలో తెరాస జెండా ఎగరవేసి అత్యధిక మెజార్టీ కోసం కృషి చేయాలన్నారు.