విద్యుత్ ఎసిడి చార్జీలను వెంటనే రద్దు చేయాలి

 

 

 

 

 

– కన్నాల సబ్ స్టేషన్ ముట్టడిలో బిజెపి రాష్ట్ర నాయకులు చందుపట్ల సునీల్ రెడ్డి జనం సాక్షి , కమాన్ పూర్ : టిఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా, ముఖ్యంగా ఏసిడి చార్జీల పేరిట విద్యుత్ వినియోగదారుల దోపిడిని నిరసిస్తూ బుధవారం పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కన్నాల సబ్స్టేషన్ ముందు బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో బిజెపి రాష్ట్ర నాయకులు చందుపట్ల సునీల్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. డిపాజిట్ పేరిట ప్రభుత్వం కరెంట్ బిల్లు అదనంగా వసూలు చేస్తూ సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నదని అన్నారు. ఏసిడి చార్జీలను వెంటనే రద్దు చేయాలని కోరుతూ విద్యుత్ అధికారులకు సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి నాయకులు వినతి పత్రం అందజేశారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఏసిడి చార్జీలను రద్దు చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి కమాన్పూర్ మండల అధ్యక్షులు జంగపల్లి అజయ్, ప్రధాన కార్యదర్శి మల్లారపు అరుణ్ కుమార్ కొయ్యడ సతీష్, కమాన్పూర్ బీజేవైఎం మండల అధ్యక్షులు పంతకాని విశ్వతేజ, భోగి రవితేజ, ఇరువురాల పరమేష్ , తొగరి తిరుపతి, కంకటి శ్రీనివాస్, పిసర్ల లక్ష్మణరావు, గండికోట బొబ్బిలి రాజ్, బుర్ర సదిగౌడ్ , వంగల సంతోష్ రెడ్డి, బండి రవి, భీమనపల్లి సాగర్, మాచర్ల సంతోష్ ,డేగల సంజీవ్ , ఉష మల్ల భూమన్న ,చిందం శ్రావణ్, ఇసుక మల్ల విష్ణు, లక్కాకుల శ్రీకాంత్ పాల్గొన్నారు.