విమోచనపై వివక్ష తగదు

మెదక్‌,సెప్టెంబర్‌13(జనంసాక్షి):17న విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని బిజెపి జిల్లా నాయకులు డిమాండ్‌ చేశారు. ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమన్నారు.  స్వేచ్ఛ, స్వాతంత్యాల్ర కోసం ఎందరో త్యాగధనులు అమరులయ్యారని, వారిని స్మరించుకోవడం మన బాధ్యతని, అందుకే సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని  పిలుపునిచ్చారు. నాటి కేంద్ర ¬ంమంత్రి సర్దార్‌పటేల్‌ చొరవతోనే హైదరాబాద్‌ భారతదేశంలో విలీనమైందన్నారు. ఇంతటి కీలక పరిణామం చోటుచేసుకోవడానికి తమ ప్రాణాలను త్యాగం చేసిన వారికి నివాళి అర్పించడం ప్రతి ఒక్కరి బాధ్యతని గుర్తుచేశారు. మజ్లిస్‌ పార్టీకి కీలు బొమ్మలుగా మారిన గత ప్రభుత్వాలు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పట్టించుకోలేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం అవతరించిన తర్వాత కూడా తెరాస ప్రభుత్వం అదే బాటలో వెళ్లడం దురదృష్ట కరమన్నారు.