వివాహిత ఆత్మహత్య

వివాహిత ఆత్మహత్య                                     బోథ్ (జనంసాక్షి)                                          బోథ్ మండలం లోని కన్గుట్ట గ్రామంలో వివాహిత ఆత్మహత్య కు పిల్పడినట్లు ఎస్సై కేంద్రే రవీందర్ తెలిపారు ఆయన వివరాల ప్రకారం… కన్గుట్ట గ్రామానికి చెందిన సంగీత (20)భర్త ఆకాష్ తో కలిసి కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమె గత కొంత కాలంగా మతిస్థిమితం కోల్పోయి అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో గురువారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. సంఘటనా స్థలాన్ని సిఐ సట్ల కిరణ్ సందర్శించారు.