విశాఖలో మంకీపాక్స్‌ కలకలం

వైద్య విద్యార్థినికి వ్యాథి లక్షణాలు
విశాఖపట్టణం,అగస్టు6( జనం సాక్షి): విశాఖకు చెందిన వైద్యవిద్యార్థిని మంకీపాక్స్‌ అనుమానిత లక్షణాలు
ఉండడంతో నగరంలో కలకలం రేగింది. వైద్య,ఆరోగ్య శాఖాధికారుతో పాటు జిల్లా అధికారులు సైతం అప్రమత్తమై పలు చర్యలు తీసుకుంటున్నారు. నగరంలోని ప్రైవేట్‌ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయర్‌ స్టూడెంట్‌ కొన్ని రోజులుగా వ్యాధి లక్షణాలతో చికిత్సపొందుతున్నారు. ఆమె శరీరం, వేళ్లపై దద్దుర్లు కనిపించడంతో వైద్య కళాశాల అధికారులు జిల్లా వైద్యులకు సమాచారం అందించారు. దీంతో విషయాన్ని విశాఖ కలెక్టర్‌ మల్లికార్జున దృష్టికి తీసుకెళ్లారు ఆయన ఆదేశాల మేరకు అప్రమత్తమైన వైద్యాధికారులు వైద్య కళాశాలకు ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీంను పంపారు. ఇవాళ ఆ వైద్య విద్యార్థిని నుంచి నమూనాలు సేకరించి పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపనున్నారు.