విశ్లేషణల్లో మునిగిపోయిన జిల్లా ప్రజలు


ఎక్కడ చూసినా ఎగ్జిపోల్స్‌పై చర్చలు
అన్ని పార్టీల్లోనూ గెలుపు ధీమా
హైదరాబాద్‌,డిసెంబర్‌8(జ‌నంసాక్షి): పోలింగ్‌ పక్రియ ముగియడం, ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు రావడంతో ఇప్పుడు అభ్యర్థులు ఎవరికి వారు లెక్కలు వేస్తున్నారు. ఏ నలుగురు కలిసినా ఇప్పుడు ఇదే చర్చ సాగుతోంది. గ్రావిూణ ప్రాంతాల్లో ప్రజలు ఇప్పడుఉ టీవీ వార్తలకు అతుక్కుపోయి, బయటనుంచి వస్తున్న వార్తలపైనా చర్చ చేస్తున్నారు. ఓట్ల పండుగ ముగియడంతో ఇక లెక్కింపు మాత్రమే మిగిలింది. దీంతో 11న ఏం జరగుబోతున్నదనే  లెక్కలు మొదలయ్యాయి.  పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులంతా తమదే గెలుపు అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్‌ బూత్‌ల వారీగా ఎక్కడెక్కడ తమకు ఎన్ని ఓట్లు లభించాయోనన్న గణాంకాలను పలువురు విశ్లేషిస్తున్నారు. అభ్యర్థులు, వారి విజయం కోసం కృషి చేసిన అనుచరులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు కూడా ఇవే లెక్కలు వేస్తున్నారు. పెరిగిన పోలింగ్‌ శాతం.. ఆయా గ్రామాలు, పట్టణాల్లో జనం నాడిని విశ్లేషిస్తూ.. జిల్లా జనం సైతం ఎవరికి వారుగా తమదైన విశ్లేషణల్లో మునిగిపోయారు. ఈనెల 11న  ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా.. ఈవీఎంలు అయినందున మధ్యాహ్నం 12గంటల వరకే పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.  గత ఎన్నికలతో పోలిస్తే భారీగా పెరిగిన పోలింగ్‌ శాతం అందరు అభ్యర్థులు, జిల్లా వాసులను సైతం పలు అంచనాలను వేయిస్తోంది. గత ఎన్నికల్లో మండలాలు, పోలింగ్‌ బూత్‌ల వారీగా ఎవరికి ఎంత మెజారిటీ వచ్చింది? ప్రస్తుతం ఆయా బూత్‌ల పరిధిలో ప్రభావం చూపగల నాయకులు ఏయే పార్టీల వైపు ఉన్నారు? జనంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల పట్ల ఎంత సానుకూలత ఉంది. ఎంత మంది ప్రజా కూటమి వైపు అనుకూలంగా ఓటేశారు? అనే అంచనాలతో లోతైన విశ్లేషణలు పలువురు చేపడుతున్నారు.
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులైన ప్రజలు తమకే ఓటేశారని టీఆర్‌ఎస్‌ నేతలు ఎక్కడిక్కడ  విశ్లేషణలు చేస్తున్‌ఆనరు.  పలు సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్‌
పోల్స్‌లోనూ ఎక్కువ సీట్లలో టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని చెప్తుండగా.. అభ్యర్థులు సైతం తమదే విజయం అంటూ దగ్గరి వాళ్లతో లెక్కలు సైతం వెల్లడిస్తున్నారు. కౌంటింగ్‌కు ఇంకా మూడు రోజుల సమయం మిగిలి ఉన్నందున.. ఇంకా పలు విశ్లేషణలకు, బెట్టింగ్‌లకు సైతం అవకాశం పొంచి ఉంది. మంగళవారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు మొత్తం ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.తమ తమ స్థానాల్లో తమదే విజయమంటూ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు.. తామే గెలుస్తున్నామంటూ వాళ్ల ప్రత్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.