వీర మరణం పొందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి చేయూత

 

 

 

సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ చేతుల విూదుగా 1.25 చెక్కు పంపిణీ

హైదరాబాద్‌,జూన్‌13(జ‌నం సాక్షి ): పోలీస్‌ కానిస్టేబుల్‌ శిక్షణలో వారంతా ఒకే బ్యాచ్‌ కు చెందిన వారు. వీర మరణం చెందిన తోటి స¬ద్యోగి కుటుంబాన్ని ఆదుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. అనుకున్నదే తడవుగా సైబరాబాద్‌ సివిల్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ (2005 బ్యాచ్‌) బ్యాచ్‌ మేట్లు కలిసి విరాళాలు సేకరించి ఆ కుటుంబానికి తమ వంతు ఆర్థిక భరోసా కల్పించారు. సుశీల్‌ కుమార్‌ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఆయన బ్యాచ్‌ మేట్లు (2005 బ్యాచ్‌) సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ చేతుల విూదుగా 1.25 లక్షల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. 2005వ సంవత్సరంలో సైబరాబాద్‌ సివిల్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ గా ఎంపికై, 2010వ సంవత్సరంలో డిప్యూటషన్‌ పై గ్రే హౌండ్స్‌ కు వెళ్లారు. ఈ క్రమంలో 2018 మార్చి 2న కొత్తగూడెంలో నక్సలైట్‌ లతో జరిపిన ఎదురు కాల్పుల్లో సుశీల్‌ కుమార్‌ వీరమరణం పొందారు. దీంతో సుశీల్‌ కుమార్‌ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఆయన బ్యాచ్‌ మేట్లు (2005 బ్యాచ్‌) సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ చేతుల విూదుగా 1.25 లక్షల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. డిజిపి సూచనల ప్రకారం కానిస్టేబుల్‌ భార్యకు తొందరగా ఉద్యోగం వచ్చేలా చూడాలని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌, సంగారెడ్డి ఎస్‌పి చంద్రశేఖర్‌ రెడ్డిని ఫోన్లో కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌, బ్యాచ్‌ మేట్లు వేణు గౌడ్‌,శ్యామ్‌ కుమార్‌, సైబరాబాద్‌ పోలీస్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు సీహెచ్‌. భద్రా రెడ్డి, జి.క్రిష్ణారెడ్డి, సుశీల్‌ కుమార్‌, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.