వెనుకంజలోనే రేవంత్‌

కొడంగల్‌: కాంగ్రెస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కొడంగల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి ఇంకా వెనుకంజలోనే కొనసాగుతున్నారు. రేవంత్‌పై తెరాస అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి స్వల్పంగా 626 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఫలితాలు ప్రారంభంలో కొద్దిసేపు ఆయన ఆధిక్యంలో కొనసాగినప్పటికీ తర్వాత కాస్త వెనుకబడ్డారు.