వేములవాడ అభివృద్ధి ఎటుపోయింది?

– రాజన్నకే శఠగోపం పెట్టిన ఘనత సీఎంకు దక్కుతుంది

– టెంపుల్‌ డెవలప్‌ మెంట్‌ ఆథారిటీ ఆఫీస్‌ను వేములవాడలో నెలకొల్పాలి

– నాలుగేళ్లయినా ఆలయ పాలకమండలిని నియమించలేదు

– మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌

– రాజన్న ఆలయ మెట్లపై కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ధర్నా

రాజన్న సిరిసిల్ల, జూన్‌18(జ‌నం సాక్షి) : రూ. 400 కోట్లు కేటాయించి వేములవాడ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని కేసీఆర్‌ చెప్పిన ప్రకటనలు ఎటుపోయాయని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ మెట్లపై సోమవారం ఉదయం కాంగ్రెస్‌ నేతలు ధర్నాకు దిగాకు. ఆలయ అభివృద్ధి కోసం కేసీఆర్‌ ఇచ్చిన హావిూని నిలబెట్టుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. భారీ ఎత్తున ఆలయం వద్దకు చేరుకున్న కాంగ్రెస్‌ శ్రేణులు కేసీఆర్‌, తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం రూ.400కోట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలు ప్రకటనలకే పరిమితమయ్యాయని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. కేసీఆర్‌ హావిూలు అమలు చేయాలంటూ సోమవారం రాజన్న మెట్లపై కార్యకర్తలతో కలిసి పొన్నం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో గుడి చెరువు పూడ్చడంతో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. మిడ్‌ మానేరు అన్ని ప్యాకేజీలు కేసీఆర్‌ సడ్డకుడికి లభిస్తాయి తప్ప సామాన్యులకు అందడం లేదని పొన్నం ఆరోపించారు. రాజన్నకే శఠగోపం పెట్టిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందని విమర్శలు గుప్పించారు. వేములవాడ టెంపుల్‌ డెవలప్‌ మెంట్‌ ఆథారిటీ ఆఫీస్‌ను హైదరాబాద్‌లో కాకుండా వేములవాడలో నెలకొల్పాడిన డిమాండ్‌ చేశారు. నాలుగేళ్లు గడిచిన ఆలయ పాలక మండలి నియమించలేదని పొన్నం ప్రభాకర్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.