వైభవంగా తిరూచానూరు కార్తీక బ్ర¬్మత్సవాలు

మోహినీ రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు
తిరుపతి,డిసెంబర్‌8(జ‌నంసాక్షి):  తిరుచానూరు కార్తీక బ్ర¬్మత్సవాలు వైభవంగా సాగుతున్‌ఆనయి. శనివారంతో 5 వ రోజుకు చేరుకున్న ఉత్సవాల్లో ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు మోహిని రూపంలో అలివేలుమంగ పల్లకిలో తిరువీధులలో విహరించారు. మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్క భజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.  శ్రీ పద్మావతి అమ్మవారికి హిందూ ధర్మార్ధ సమితి వారు గొడుగులు సమర్పించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి కార్తీక బ్ర¬్మత్సవాలలో 5 వ రోజు న నిర్వహించే గజ వాహన సేవకు చెన్నైకు చెందిన హిందూ ధర్మార్థ సమితి ట్రస్ట్‌ తరఫున గొడుగులను తిరుచానూరు అమ్మవారి బ్ర¬్మత్సవాలకు అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఈ రోజు ఉదయం 9 గంటలకు తిరుచానూరు ఆలయం వద్ద హిందూ ధర్మం సమితి ట్రస్ట్‌ ఆర్‌ఆర్‌ గోపాల్‌ తిరుచానూరు అమ్మవారి ఆలయ ఉప కార్య నిర్వాహక అధికారి జాన్సిరాణి, విజిఓ అశోక్‌ కుమార్‌ గౌడ్‌ చేతుల విూదుగా గొడుగులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీవియస్‌ఓ గోపినాథ్‌ జెట్టి, డిప్యూటీ ఈఓ జాన్సిరాణి, ఏఈఓ సుబ్రహ్మణ్యం, సూపరింటెండెంట్‌ గోపాల్‌,ఆర్జిత ఇన్స్పెక్టర్‌ శ్రీనివాస్‌, ప్రధాన అర్చకులు బాబుస్వామి పాల్గన్నారు.