వైల్డ్‌ లైఫ్‌ ఇనిస్టిట్యూట్‌ ద్వారా సమగ్ర సమాచారం

ఆదిలాబాద్‌,మార్చి30(జ‌నంసాక్షి): దేశ వ్యాప్తంగా నాలుగేళ్లకోసారి నిర్వహించే అటవీ జంతువుల గణనను జనవరి 22 నుంచి ఏడు రోజుల పాటు నిర్వహించి అనేక వివరానలు సేకరించారు. అటవీ ప్రాంతాల్లో అమర్చిన సీసీ కెమెరాల పుటేజీల ఆధారంగా జంతువుల గణన చేశారు.  దేశ వ్యాప్తంగా నిర్వహించిన జంతు గణనలో భాగంగా అటవీ శాఖ అధికారులు జనవరి 22 నుంచి ఏడు రోజుల పాటు అటవీశాఖ అధికారులు నిర్వహించారు. బీట్ల వారీగా అధికారులు బౌండరీలను ఏర్పాటు చేసుకొని జంతు గణనను నిర్వహించారు. పులుల ఆవాసాల్లో గణన చేపట్టేందుకు 15 కిలోవిూటర్లు, శాఖాహార జంతువుల, వృక్ష జాతుల అధ్యయనం బీట్‌లో రెండు కిలోవిూ టర్లు మార్గాలను ఎంపిక చేసుకొని జంతు గణనను నిర్వహించారు. మాంసాహార జంతువులు 171 ఉండగా.. శాఖహార జంతువులు 1053ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సర్వే నివేదికను ఢిల్లీలోని వైల్డ్‌లైఫ్‌ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా పరిశోధన కేంద్రానికి పంపారు. కేంద్రం నుంచి వచ్చే నివేదిక అనంతరం వణ్యప్రాణుల సంఖ్యపై పూర్తి స్థాయిలో స్పష్టత రానుంది.. పులుల గణన రక్షిత అటవీ ప్రాంతాల్లో ఈ సర్వే సాగింది. పులులు, నక్కలు, తోడేళ్లు, ఇతర మాంసాహారం తీసుకొనే జంతువులు, గడ్డి తినే జం తువులు ఎన్ని ఉన్నాయో గణించారు. ఆయా జంతువులు ఎక్కువగా ఉండడానికి కారణాలు,ఇతర ప్రదేశాల్లో జంతువు ఉత్పత్తి ఎందుకు తగ్గింది? అనే కారణాలను తెలుసుకున్నారు. ఆవాసాల అధ్యయనం, జంతువులకు ఎలాంటి ఆవాసాలు అనుగుణంగా ఉంటాయి? అటవీలో ఉన్న వృక్ష జాతులను సైతం అధ్యయనం చేశారు.  నేలను పట్టుకొని గడ్డిజాతి కలుపు మొక్కలు, వనమూళికలను పరిశీలించారు. ఏ రకమైన అడవి, దాని నేల స్వభావం, పెరుగుతున్న మొక్కలు, జంతువుల అభివృద్ధి? ఆ జాతి పరిణామ క్రమంలో పెరిగిన, తగ్గిన శాస్త్రీయమై న పద్ధతులతో గణన నిర్వహించారు. ప్రత్యక్ష వీక్షణ, పెంబకలు, పాదముద్రలు, జంతువుల అరుపులు, భూమిపై, చెట్లపై చారలు, గీరలు, జంతువుల కీర బలాలు, పశువుల కాపరులు, స్థానిక ప్రజల అభిప్రాయాలను సేకరించారు.