వ్యవసాయాన్ని పండగలా మార్చిన ఘనత సిఎం కెసిఆర్‌దే: మంత్రి

రంగారెడ్డి,మే10(జ‌నం సాక్షి): జిల్లాలోని మొయినాబాద్‌ మండలం అజీజ్‌నగర్‌లో రైతుబంధు పథకాన్ని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ రఘునందన్‌రావు, జిల్లా సమన్వయసమితి కన్వీనర్‌ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రైతుబంధు పథకం దేశ చరిత్రలో నిలిచిపోతుంది. గత పాలకుల హయాంలో వ్యవసాయం దండుగ అనే స్థాయి నుంచి వ్యవసాయం పండగులా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌ది. రాష్ట్రంలో 58.33 లక్షల మంది రైతులకు రూ.12 వేల కోట్ల పెట్టుబడి సహాయం రెండు విడుతలుగా అందిస్తున్నాం. ఉమ్మడి జిల్లాలో 5,04,478 మంది రైతులకు పాస్‌పుస్తకాలతో పాటు 553 కోట్ల 88 లక్షల పెట్టుబడులు అందిస్తున్నం. రైతులకు కోట్లాది నిధులతో వ్యవసాయ మంత్రాలు, అంతరాయం లేకుండ 24 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా చేసి రాష్ట్ర రైతాంగాన్ని ఉన్నత స్థితికి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.