శశికళ సీఎం అవడంపై చిదంబరం కామెంట్‌

a56tlbrw

 చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి మార్పు అంశంపై కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి పీ చిదంబరం స్పందించారు. గతంతో పోలిస్తే తమిళనాడు పరిస్థితులు పూర్తి భిన్నంగా మారాయని అన్నారు. గతంలో గర్వంగా చెప్పుకునేలా ఉండేదని, ఇప్పుడు మాత్రం ఇప్పుడు మాత్రం తమిళనాట ప్రజానీకం నాయకులు దానికి పూర్తి విరుద్ధంగా వెళుతున్నాయంటూ ట్వీట్‌ చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి  పన్నీర్‌ సెల్వం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తదుపరి సీఎంగా శశికళ వస్తున్నారని ఇప్పటికే దాదాపుగా ఖరారైపో​యింది.

ఈ నేపథ్యంలో తమిళనాడులో పలువురు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పీ చిదంబరం కూడా రాష్ట్ర పరిస్థితులపై కాస్తంత అసంతృప్తిగానే ట్వీట్‌ చేశారు. ‘ ఒక్కసారి గర్వంగా గతంలోకి చూసినప్పుడు కామరాజ్ నాడార్‌‌, అన్నాదురైలాంటి
నేతలు తమిళ సీఎం పీఠాన్నిఅధిరోహించారు. అన్నాడీఎంకే పార్టీ, తమిళనాడు ప్రజలు ఇప్పుడు వేర్వేరు దిశల్లో వెళుతున్నారు. తమ నేతను ఎన్నుకోవడం అనేది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల హక్కు. అలాగే, ముఖ్యమంత్రి అభ్యర్థిగా వస్తున్న వ్యక్తి అర్హతలను గురించి అడిగి తెలుసుకోవడం ప్రజలకున్న హక్కు’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు.