శిక్షణ పోలీసుల్లో అనేకులు ఉన్నత విద్యావంతులే

హైదరాబాద్‌,మే3(జ‌నంసాక్షి): ఇటీవల పోలీస్‌ ఉద్యోగానికి ఎంపికై శిక్షణ పొందుతున్న వారిలో అనేకులు ఉన్నత విద్యావంతులే కావడం విశేషం. వీరిలో ఎంబీఏ, బీటెక్‌, బీఈడీ, ఫార్మసీ, డిగ్రీ వంటి ఉన్నత చదువులు పూర్తిచేసిన వారు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో పోటీ ఏర్పడడంతో వీరు కానిస్టేబుల్‌ ఉద్యోగాల్లో చేరిపోయారు. శిక్షణలో ఆధునిక టెక్నాలజీపై పట్టు సాధించడం చాలా సులువయ్యిందని పేర్కొన్నారు.కొత్తగా పోలీసు జీవితాన్ని ప్రారంభించనున్న యువత క్రమశిక్షణతో తర్ఫీదు పొందాలని సూచించారు. శిక్షణా కాలంలోనే ఇంటర్‌నెట్‌ సదుపాయంతో కూడిన ల్యాప్‌టాప్‌లను అందిస్తున్నామని చెప్పారు. ‘ఈ-బుక్‌’, ‘సైబర్‌ కైం’, ‘కమ్యూనిటీ పోలీసింగ్‌’, ‘కంప్యూటర్‌ ల్యాబ్స్‌’ అంశాలపై ఇండోర్‌ తరగతులను బోధించడానికి ఏర్పాట్లు చేశామన్నారు. ప్రధానంగా సైబర్‌ కైమ్ర్‌ విషయంలో అవగాహన కల్పించడం సులువువుతందన్నారు. శిక్షణ కాలంలో లోటుపాట్లను అధిగమించేలా వెనుకబడిన వారికోసం ఒక పోలీసు అధికారిని నియమించామన్నారు.