శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ పని వేళల్లో మార్పులు..

ఆదిలాబాద్:భానుడి భగభగకు బొగ్గు కార్మికులు విలవిలలాడిపోతుండడంతో శ్రీరాంపూర్ ఓపెన్‌కాస్ట్ పని వేళలు మార్చారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మొదటి షిఫ్ట్. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రెండో షిఫ్ట్. ఇవాళ్టి నుంచి రెండు ఓఆర్‌సీ, రెండు మజ్జిగ ప్యాకెట్లను యాజమాన్యం కార్మికులకు అందజేయనుంది.