శ్రీ దత్తగిరిలో వైభవంగా చండీ హోమం – ముగిసిన రాజ శ్యామల నవరాత్రులు

 

 

 

 

 

 

కొనసాగుతున్న శత జయంతి ఉత్సవాలు- 4వ తేదీన జగద్గురులు రాక
5న సిద్దేశ్వర స్వామికి పట్టాభిషేకంజహీరాబాద్ జనవరి 31 (జనం సాక్షి )తెలంగాణలో ప్రసిద్ధి చెందిన దత్త క్షేత్రాలలో ఒక్కటైనా ఝరాసంగం మండలం పరిధిలోని బర్దిపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో శ్రీ దత్తగిరి మహారాజ్ శత జయంతి ఉత్సవాలు అతి వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు నిత్య పూజలతో పాటు శివునికి అతి ఇష్టమైన అతి రుద్రం, దత్తాత్రేయ స్వామి వారికి రుద్ర సహిత దత్త యజ్ఞం, ప్రతిరోజు గోపూజ, ప్రతిరోజు వైదిక పాఠశాల విద్యార్థులచే అతి వైభవంగా నిర్వహిస్తున్నారు. గత 10 రోజుల నుండి శ్రీ రాజశ్యామల నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పదవ రోజైన మంగళవారం చండీ హోమం, పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు అత్యంత క్రతువుగా సాగిన శ్రీ చండీ యాగం వైదిక మంత్రాలుచే ఘనంగా నిర్వహించారు. శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల నాలుగవ తేదీన శ్రీశైలం జగద్గురువు చేన్న సిద్ధరామ శివాచార్య మహా స్వామీజీ, కాశీ పీఠం జగద్గురు శ్రీశ్రీశ్రీ 1008 చేన్న మల్లికార్జున శివాచార్య మహాస్వామిజి రానున్నట్లు ఆశ్రమ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ 108 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్, దత్తగిరి మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అల్లాడి వీరేశం గుప్త తెలిపారు. 5వ తేదీన ఆశ్రమ ప్రస్తుత బావి పీఠాధిపతి డాక్టర్ సిద్దేశ్వరానందగిరి మహారాజ్ పట్టాభిషేకం ఉంటుందని వారు వివరించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.