శ్రీ మహాలక్ష్మి అలంకరణలో దర్శనమిచ్చిన బతుకమ్మ కుంట దుర్గమ్మ .

జనగామ (జనం సాక్షి) అక్టోబర్ 1: జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట శ్రీ శ్రీ దుర్గాదేవి దేవాలయం లో అమ్మ వారికి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు దుర్గాదేవి ఆలయ కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పిట్టల సత్యం వాంకుడోత్ అనిత ఆధ్వర్యంలో వైభవోపేతంగా నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు . శనివారం 6వ రోజు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ మహాలక్ష్మి అవతారంలో దర్శనం ఇచ్చిన దుర్గాదేవి అమ్మవారు, ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు రాజలింగారాధ్య మాట్లాడుతూ ఈ రోజు మన దేవాలయంలో శ్రీ మహాలక్ష్మి అవతారంలో దర్శనం ఇచ్చారని మంగళప్రదమైన దేవత ఈ మహాలక్ష్మి దేవి. జగన్మాత మహాలక్ష్మి స్వరూపంలో దుష్ట రాక్షస సంహారాన్ని చేయడం ఒక అద్భుతం మూడు శక్తులు ఒకే శక్తెనా శ్రీ మహాలక్ష్మి అమితమైన పరాక్రమాన్ని చూపించి హలుడు రాక్షసుడిని సంహరించింది. లోక స్థితికారనిగా ధన, ధాన్య ,,ధైర్య విజయ, విద్య ,సౌభాగ్య, సంతాన గజల్ లక్ష్మణులుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మి సమిష్ఠ రూపమైన అమృతస్వరూపునిగా శ్రీ దుర్గమ్మ ఈరోజు మహాలక్ష్మి దేవిగా భక్తులకు అనుగ్రహిస్తారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం వల్ల భక్తులందరికీ ఐశ్వర్య ప్రాప్తి విజయం లభిస్తుందని ఈ సందర్భంగా వివరిస్తూ ఇక్కడ మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో లలిత పారాయణం భజనలు ఆధ్యాత్మిక ప్రవచనాలు పలు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని జనగామ ప్రజలు అందరు వచ్చి అమ్మ వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మ వారి కృపకు పాత్రులు కాగలరని తెలిపినారు. దేవాలయ కమిటి అధ్యక్షులు పిట్టల సత్యం మాట్లాడుతూ భవాని మాల ధరించిన జనగామ పట్టణ భవాని మాతలకు అన్నదానం ఆలయ కమిటీ తరఫున ఏర్పాటు చేయడం అయినదని కావున భవానిలో అందరూ పాల్గొనగలరని ఈ సందర్భంగా తెలిపారు.