సంక్షేమం అభివృద్ధిలో సమపాళ్లు

ఆదర్శంగా నిలిచిన తెలంగాణ పాలన

ప్రగతి నివేదన సభతో విపక్షాలకు సవాల్‌

నిజామాబాద్‌,ఆగస్ట్‌29(జ‌నం సాక్షి): వ్యవసాయం దండుగకాదు పండుగ అని నిరూపించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందనీ ఎమ్మెల్యే బీగాల గణెళిశ్‌ అన్నారు. రైతు సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేసిన ఘనత సిఎం కెసిఆర్‌దని, తమది రైతుబంధు ప్రభుత్వమని పేర్కొన్నారు. గతపాలకుల నిర్ల క్ష్యం కారణంగా వ్యవసాయం రంగం పూర్తిగా కుంటుబడిపోయిందనీ, దీని వల్ల మన ప్రాంతం నుంచి గల్ఫ్‌కు వలసలు పెరిగాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ అన్నదాతను ఆదుకొని అగ్రభాగానికి చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు. ఈ దశలో చేపడుతున్న కార్యక్రమానలు వివరించేందుకే ప్రగతినివేదన సభ పెట్టామన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాలుగేళ్లలో అభివృద్ధిలో దూసుకెళ్తూ బంగారు తెలంగాణ దిశగా బలమైన అడుగులు వేయగలిగామన్నారు. పెట్టుబడి సాయంతో అన్నదాతలకు అండగా ఉంటున్నామనీ, సబ్బండ వర్గాల అభివృ ద్ధే లక్ష్యంగా సర్కారు పాలన కొనసాగుతుందన్నారు. ఎప్పటికీ రైతు సంక్షేమం పైననే ద్యాస ఉంచే ప్రభుత్వం కనుకనే రూ.5లక్షల ప్రమాదబీమా పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. విడిపోతే చెడిపోతారు అని ఎద్దేవా చేసినవారే ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి, నాలుగేళ్లుగా సాధించిన ప్రగతిని చూసి నివ్వెరపోతున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల పాలనలో అభివృద్ధితోపాటు ఆయా రంగాల్లో నిర్లక్ష్యానికి గురైన మైనారిటీలకు తెలంగాణ సర్కార్‌ పెద్దపీట వేసిందన్నారు. ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా ప్రభుత్వ దావాఖానాల్లో కాన్పు అయిన పేద మహిళలందరికి రూ.12వేల ఆర్థిక సాయం, ఆడపిల్ల పుడితే అదనంగా మరో వెయ్యి అందిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్‌ కిట్ల పంపిణీ చేపడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో సన్న బియ్యంతో మెరుగైన భోజనాన్ని అందిస్తున్నామన్నారు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ దేశంతోపాటు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్‌ను అందిస్తూ విమర్శలకు తగిన గుణపాఠం చెప్పినట్లయిందన్నారు. ఒకప్పుడు ఎరువులు, విత్తనాలకో సం చెప్పులు క్యూలో పెట్టడం, ఎరువుల బస్తాల కోసం పోలీసు ల లాఠీ దెబ్బలు తినే దుస్థితి ఉండేడిదన్నారు. ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచి, అదునుకు అందించడం పైననే సర్కార్‌ దృష్టి సారించిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలో అతి పెద్ద ప్రాజెక్టు అన్నారు. కాళేశ్వరం పనులు ఈ దసరా వరకు పూర్తయ్యేలా పనులు వేగవంతంగా నడుస్తున్నా యన్నారు. పేదకుటుంబాలకు ఆడపిల్ల పెళ్లి భారంగా మారుతున్న పరిస్థితిలో పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లు ఘనంగా జరగాలని రూ.1,00, 116 అందిస్తున్నామన్నారు. ఇంతకుముందు ఎ స్సీ, ఎస్టీ మైనార్టిలకు మాత్రమే వర్తింపజేసిన ఈ పథకాన్ని ఆర్థికంగా బీసీ, ఈ బీసీ వర్గాలకు సైతం వర్తింపజేసినట్లు తెలిపారు. అలాగే గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపరిచేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. గొల్లకురుమలకు ప్రతీ కుటుంబానికిరాయితీపై గొర్రెలు ఇస్తున్నట్లు చెప్పారు. మత్స్యకార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ చెరువుల్లో, రిజర్వాయర్లలో చేపల పెంపకం చేపట్టామన్నారు.