సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిగా బతుకమ్మ పండుగ

– ఎంపీపీ గుగులోత్ పద్మావతి రవి నాయక్

-కురవి మండల వ్యాప్తంగా బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ప్రజా ప్రతినిధులు

కురవి సెప్టెంబర్ -25 (జనం సాక్షి న్యూస్)

సంస్కృతి, సంప్రదాయాలకు ప్రత్యేక బతుకమ్మ పండుగ అని ఎంపీపీ గుగులోత్ పద్మావతి రవి నాయక్ అన్నారు. ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన వివిధ గ్రామాల సర్పంచులు ప్రజా ప్రతినిధులు.కురవి మండలంలోని రాజోలు లో సర్పంచ్ షేక్ మస్తాన్, ఉప్పరిగూడెం లో కాలం తిరుపతిరెడ్డి, నేరడ లో గుండుజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎంపీపీ పద్మావతి రవి నాయక్ చేతుల మీదగా,గుండ్రాతిమడుగు లో వాసు, కందికొండలో వడ్డూరి పద్మ తో పాటు వివిధ గ్రామాల్లో ప్రజాప్రతినిధులుచే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ కానుకగా మహిళా ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల సర్పంచ్లు మాట్లాడుతూ ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు కానుక అందించడంతోపాటు చేనేత కార్మికులకు ఉపాధి చూపాలన సంకల్పంతో సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరలు పంపిణీ సంకల్పం చేశారని వాళ్లు అన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకంతో నిరుపేద మహిళలు సైతం బతుకమ్మ పండుగకు కొత్త చీరలు కట్టుకొని మురిసిపోతున్నారని అన్నారు. పూలనే దేవతగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ రాష్ట్రంలో తప్ప ప్రపంచంలో మరెకడ లేదని సర్పంచులు, ప్రజా ప్రతినిధులు అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప్పరగూడెం గ్రామంలో తెలంగాణ జాగృతి డోర్నకల్ నియోజకవర్గ యూత్ కన్వీనర్ పేర్ల గణేష్ ముదిరాజ్,రైతు సమన్వయ సమితి గ్రామ కో ఆర్డినేటర్ సముద్రాల శ్రీనివాస్, ఉప సర్పంచ్ రమేష్, రేషన్ డీలర్లు లంజపల్లి పద్మావతి, మల్లికంటి పద్మ, రాజోలు గ్రామంలో ఉప సర్పంచ్ అంబటి అనూష, వార్డు మెంబర్ నాగయ్య, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు అంబటి విష్ణువర్ధన్,గుంటకల్ యాదగిరి, రచ్చగొల్ల సత్యనారాయణ, చెవులు వెంకన్న, పంచాయతీ కార్యదర్శిలు నిమ్మల సతీష్,యుగేందర్, ఐకెపి సిబ్బంది లు, వివిధ గ్రామాల వార్డు మెంబర్లు,అంగన్వాడి కార్యకర్తలు,మహిళ సంఘాలలు,గ్రామ పెద్దలు ముఖ్య కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.