సజీవంగా ప్రత్యేక¬దా డిమాండ్‌ 

జగన్‌ పోరాటమే కారణమన్న కోటం రెడ్డి
నెల్లూరు,ఫిబ్రవరి26(జ‌నంసాక్షి):  ప్రత్యేక ¬దాపై ఆశలు సజీవంగా ఉన్నాయంటే ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి గత నాలుగేళ్లుగా చేస్తున్న పోరాటమే కారణమని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్‌ రెడ్డి అన్నారు. ఆయనకారణంగానే ఇవాళ అందరూ మళ్లీ ప్రత్యేక మోదా గురించి మిట్లాడుతున్నారని అన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. జననేత చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 100వ రోజు సందర్భంగా నగరంలోని 100 ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక పూజలు
నిర్వహిస్తామన్నారు. ఓటుకునోటు కేసుకు భయపడి, పోలవరం ప్రాజెక్టులో కమిషన్‌లకు కక్కుర్తిపడి సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక ¬దాను గాలికి వదిలేసారని ధ్వజమెత్తారు. ఎన్నికలు దగ్గర పడటంతో చంద్రబాబు డ్రామాలు మొదలు పెట్టారని మండిపడ్డారు. వైఎస్‌ఆర్‌సీపీ ఒక్కటే ఆంధప్రదేశ్‌ ప్రత్యేక ¬దా కోసం అలుపెరగని పోరాటం చేస్తోందని అన్నారు. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రత్యేక¬దా కోసం పోరాడుతామని, కేంద్రం నుంచి ప్రకటన రాకుంటే ఏప్రిల్‌ 6న తమార్టీ ఎంపిలు రాజీనామాలు చేస్తారని ప్రకటించారు. రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ప్రత్యేక ¬దా ఒక్కటే మార్గం అని ఆయన అభిప్రాయ పడ్డారు. ఏపీ ప్రయోజనాలపై తెలుగుదేశానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే తమతోపాటు రాజీనామాలు చేయాలని డిమాండ్‌ చేశారు. గత నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలుగుదేశం ఎంపీలు ఏపీ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేక ¬దాపై చంద్రబాబు ఊసరవెల్లిలా రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని, ప్రస్తుతం బాబు మాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని కోటం రెడ్డి పేర్కొన్నారు.