సమాచారహక్కు చట్టం మరింత నిర్వీర్యం

సమాచారహక్కు చట్టం ఏకపక్షంగా సవరణలతోసాగడంతో పాటు, అది నిర్వీర్యం అయిపోతోందని ఇటీవల ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. దానిని నిర్వీర్యం చేస్తున్నరాని చేస్తున్న ఆందోళనలపై పెద్దగా ఎవరు కూడా పట్టించుకున్న దాఖాలాలు కానరాలేదు. కేంద్ర సమచారహక్క కమిషనర్‌గా పదవీవిరమణ చేసిన డాక్టర్‌ మాడభూషి శ్రీధరాచార్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తెలుగు రాష్ట్రాల సిఎంలకు ఓ లేఖ రాస్తూ కేంద్రానికి తల వంచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టొద్దని సూచించారు. అయితే ఆయన లేఖను సిఎంలు కెసిఆర్‌, జగన్‌లు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎందుకంటే  సవరణలతో కూడిన ఈ చట్టం పార్లమెంట్‌ ఆమోదం పొందింది. ఈ చట్ట సవరణకు అటు వైకాపా, ఇటు టిఆర్‌ఎస్‌లు మద్దతు పలికాయి. అవినీతికి వ్యతిరేకంగా ప్రజాతంత్ర ఉద్యమాలు, సంఘసంస్కర్త, సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే తదితరులు సాగించిన పోరాటాల ఫలితంగా నాడు వామపక్షల చొరవతో ఈ చట్టం పురుడుపోసుకున్న సంగతి విదితమే. ఈ చట్టం ప్రధాన లక్ష్యాలను నిర్వీర్యం చేసేలా తీసుకొచ్చిన సవరణల బిల్లు రాజ్యసభలో ఇప్పటికే  ఆమోదం పొందింది.
స్వతంత్ర ప్రతిపత్తిగా ఉన్న సమాచారహక్కు కమిషన్‌ను ఇప్పుడు తమ కింద పనిచేసే ప్రభుత్వ విభాగాల్లో ని ఒక భాగంగా మార్చేసేందుకే ఈ సవరణలు తీసుకొచ్చిందన్న్న విమర్శలు ఉన్నాయి. సమాచార హక్కు చట్టాన్ని పారదర్శకత పెంచడం కోసం సవరిస్తున్నామని చెబుతూ, సవరణ చట్టం ద్వారా ఏం సవరిస్తున్నా రో పార్లమెంటుకు కూడా చెప్పకుండా దాచడం ఏ పాటి పారదర్శకతో పాలకులే చెప్పాలి. ప్రభుత్వంలో ఎవరుంటే వారి ఇష్టం వచ్చిన రీతిలో స్థాయిని నిర్ణయించుకోవచ్చు అనే పాలకుల వ్యూహాలు ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత ప్రమాదకరం.  రాజకీయ అవినీతిని అరికట్టాలని జరుగుతన్న పోరాటాలకు మరింత పదను పెట్టే చట్టాలను తీసుకుని రావాల్సి ఉండగా ఉన్నవాటిని నిర్వీర్యం చేస్తున్నారన్న ఆందోళనలకు సహజంగానే రాజకీయ పార్టీలు స్పందించవు. ఎందుకంటే అవినీతిని బయటపెట్టే ప్రయత్నాలు జరుగ రాదన్నదే వారి లక్ష్యం. అందుకే అవినతి విషయంలో పరస్పరం ఆరోపణలు చేసుకునే రాజకీయ నేతలు అధికారంలోకి రాగానే గతంలో పానల చేసిన వారి అవినీతిని బయటపెట్టి వారిని దోషిగా నిలిబెట్టిన సఘంటనలు బహు అరుదు.  కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ నియంతృత్వ కత్తికి మరో స్వతంత్ర సంస్థ బలైపోతోంది. అధికార యంత్రాంగాన్ని ప్రజలకు జవాబుదారీ చేస్తూ నిజాలు వెలుగులోకి తీసుకొచ్చే కాంతిరేఖగా యుపిఎ-1 హయాంలో ఉదయించిన సమాచార హక్కు చట్టం (ఆర్‌.టి.ఐ) స్వతంత్రతకు, హేతుబద్ద సవరణల పేరిట మోడీ సర్కార్‌ ఆమోదం లభింపచేసుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం..ఎన్నికల కమిషన్‌తో సమానంగా సమాచార కమిషన్‌కు స్థాయి, ¬దా, అధికారం, వేతనాలు ఉన్నాయి. ఎన్నికల సంఘం స్థాయిని సమాచార కమిషనర్‌కు ఇవ్వడం తప్పు కనుక తగ్గించడం సవరణల లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. ఒక వేళ తగ్గిస్తే ఏ స్థాయికి తగ్గిస్తారనే ప్రశ్నకు సమాధానం లేదు. జీత భత్యాలు, నియామక పక్రియ సంగతీ తేల్చలేదు. పార్లమెంటు సభ్యులకు కూడా ఈ విషయాలు చెప్పకుండా రహస్యంగా ఉంచాల్సిన అవసరమేంటి అన్నది తెలియదు.  పైగా రాష్టాల్ర సమాచార హక్కు కమిషన్‌ బాధ్యుల నియామకాలను కూడా కేంద్రమే నియమించడమంటే అది సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కల్గించడమేనని న్యాయ కోవిదులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది రాష్ట్రాల హక్కులను కాలరాయడమే అన్న ఆందోళనలను కూడా కేంద్రం పట్టించుకోలేదు. ప్రజలకు వేగుచుక్కలా ఉన్న ఆర్‌.టి.ఐ చట్టంలో
సవరణలను చేసే ముందు కనీసం బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపాలన్న డిమాండ్‌ను సైతం ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీసం అలాంటి చిత్తశుద్ది కూడా కేంద్ర ప్రభుత్వానికి రాలేదు. ఆర్‌.టి.ఐ స్వతంత్రతను దెబ్బ తీసే సవరణలను వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష సభ్యులు ఇదే డిమాండ్‌ చేసినా మోడీ సర్కార్‌ తోసిపుచ్చింది. ఎంతటి దుర్మార్గమైన వ్యూహంతో ఆర్‌.టి.ఐ నిర్వీర్యానికి కంకణం కట్టుకుందో అర్థం చేసుకోవచ్చని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా ఇప్పుడు చేసేదేవిూ లేదు. దీనిని నిలదీయాల్సిన వివిధ పార్టీలు రాజ్యసభలో మద్దతు తెలిపి తమ అశక్తతను చాటుకున్నాయి. /ూజ్యసభలో ఐదుగురు అధికార సభ్యుల పదవీకాలం బుధవారం ముగియడంతో మెజారిటీ నిరూపణకు ఆరు సీట్లు అవసరం కావడంతో కేంద్ర ¬ంమంత్రి అమిత్‌ షా ఆగమేఘాల విూద బి.జె.డి, పి.డి.పి, వై.సి.పి, టి.ఆర్‌.ఎస్‌, టి.డి.పి తదితర పక్షాలతో సంప్రదింపులు జరిపి అప్పటికప్పుడు  బిల్లును ఆమోదించుకున్న తీరు ఎవ్వరికైనా విస్మయం కలిగించక మానదు.  ఆర్‌.టి.ఐ సవరణలు వ్యతిరేకించి తీరుతామని అప్పటిదాకా బీరాలు పలికిన టి.ఆర్‌.ఎస్‌ వంటి పార్టీలు యూ టర్న్‌ తీసుకొని బిజెపి ఉచ్చులో పడటం సిగ్గుచేటు. ప్రత్యేక ¬దాతో పాటు రాయితీలు సైతం ఇచ్చే ప్రసక్తే లేదని మొహం విూదే మొత్తినట్టుగా చెప్పిన బి.జె.పి నేతలపై ఇలాంటి కీలక సమయంలో పట్టు బిగించాల్సిన వై.సి.పి, అమిత్‌ షా వ్యూహాలకు నీరుగారిపోవడం విడ్డూరం. వాస్తవానికి సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్రసర్కార్‌ మొదటి నుంచీ ప్రయత్నిస్తూనే ఉందని విమర్శలు వచ్చాయి. చట్టాన్ని మరింత బలోపేతం చేయాల్సింది పోయి దాని కోరలు పీకేయడం అంటే వేలెత్తకుండా చేయడమే తప్ప మరోటి కాదు. కమిషనర్లను నియమించడంలో విూన మేషాలు లెక్కిస్తూ సమాచార కమిషన్‌ చేతులు కట్టిపడేసింది. సి.ఐ.సి వద్ద వేల అప్పీళ్లు, ఫిర్యాదులు పెండింగ్‌లో ఉండటమే దీనికి నిదర్శనం. ఇప్పుడు సవరణలతో అది కోరలు లేనిదిగా మారిందనడంలో సందేహం లేదు.