సరిహద్దు ఎన్‌కౌంటర్‌… మోడీ సమీక్ష

దిల్లీ,నవంబరు 20(జనంసాక్షి): ముంబయి దాడి జరిగిన నవంబర్‌ 26 కంటే మరింత భారీ దాడులకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు నిఘావర్గాలు గుర్తించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అత్యవసర ఉన్నతస్థాయి సవిూక్ష నిర్వహించారు. జమ్ము కశ్మీర్‌లో నగ్రోటాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాదులు భారీ కుట్రను అమలు చేసేందుకు వచ్చినట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఉన్నతాధికారులతో సవిూక్ష నిర్వహించారు.పాకిస్థాన్‌కు చెందిన జైషే మహమ్మద్‌ ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టడాన్ని ప్రధాని అభినందించారు. పెద్ద ఎత్తున మారణాయుధాలు, పేలుడు పదార్థాలతో భారీ దాడికి ప్రణాళికలు రచించిన ఉగ్రవాదులను భారత జవాన్లు ముందస్తుగానే కనిపెట్టారని అన్నారు. భారీ వినాశనాన్ని అడ్డుకున్న భద్రతా దళాలను ప్రధాని మరోసారి కొనియాడారు. తాజా పరిస్థితులపై ఆయన కేంద్ర ¬ంశాఖ మంత్రి అమిత్‌షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోబాల్‌, విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్‌ శ్రింగ్లాతోపాటు ఇంటెలిజెన్స్‌ ఉన్నతాధికారులతో సవిూక్ష నిర్వహించారు