సర్కారుకు ఒక్క పైసా నష్టం వాటిల్లినా ఊరుకోను

– భూస్కాంపై సీఎం కేసీఆర్‌ సీరియస్‌

హైదరాబాద్‌,జూన్‌ 13(జనంసాక్షి): మియాపూర్‌, బాలనగర్‌, ఇబ్రహీపట్నం, శంషాబాద్‌ తదితర ప్రాంతాల్లో జాగీరు భూములపై హక్కులు సంపాదించడానికి కొంతమంది చేసిన ప్రయత్నం వల్ల ఎక్కడా ఇ?జూనాకు ఒక్క రూపాయి కూడా నష్టం కలగలేదని, ఒక్క (5?నీ ప్రభుత్వ భూమి కూడా అన్యాక్రాంతం కాలేదని ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. ఈ ప్రాంతాల్లో ప్రైవేటు వ్యక్తులకు రిజిష్టర్‌ అయిందని పేర్కొంటున్న భూమంతా ప్రభుత్వ ఆధీనంలోనే ఉందని అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తెచ్చారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా, విూడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా ఈ వ్యవహారంలో కుంభకోణం ఏవిూలేదని, ఎక్కడా ప్రభుత్వానికి నష్టం కలగలేదని ప్రభుత్వం నిర్ధారించుకున్నది. అయితే ఈ రిజిస్టేషన్లకు సంబంధించి కొంతమంది వజూ5ూవ35ూవనీూ) పాల్పడినట్లు కూడా స్పష్టంగా తేలింది. ?? వ్యవహారంలో ఇప్పటికే కొంత మందిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి, అరెస్టులు కూడా చేశామని, పోలీసులు విచారణ జరుపుతున్నారని, సిబిఐ దర్యాప్తు కోరాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది. పాత జాగీర్‌ భూములపై హక్కులు సాధించడానికి జిపిఎలు సృష్టించి, కోర్టు కేసులలో బలం చేకూరడానికి తప్పుడు పద్దతిలో ఈ రిజిస్టేషన్లు చేయించుకున్నట్లు ప్రభుత్వం భావిస్తున్నది. అసలు ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు చేయడమే కుదరదని, అలా చేసిన రిజిస్టేషన్‌ చెల్లదని, దానికి చట్టబద్దత కూడా ఉండదని, ప్రభుత్వ భూమి మార్పిడి కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. తప్పుడు పద్దతిలో జరిగిన విషయంలో అవకతవకలకు పాల్పడిన వారిలో కొందరిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని, ఇంకా విచారణ జరుగుతున్నదని, దోషులు ఎంతటి వారైనా సరే శిక్షించి తీరుతామని సిఎం కేసీఆర్‌ చేశారు. విచారణను కొనసాగించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.ప్రభుత్వ భూముల రిజిస్టేషన్‌ వ్యవహారానికి సంబంధించిన ఇటీవల వెలుగుచూసిన అంశాలకు సంబందించి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు మంగళవారం ప్రగతి భవన్‌ లో ఉన్నత స్థాయి సవిూక్ష నిర్వహించారు. మియాపూర్‌, బాలనగర్‌, ఇబ్రహీంపట్నం, శంషాబాద్‌ తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ భూమిపై హక్కులు సంపాదించడానికి సట్‌ రిజిస్టార్ల సహకారంతో జరిగిన దందాపై విస్తృతంగా చర్చించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, డిజిపి అనురాగ్‌ శర్మ, రెవెన్యూ ముఖ్య కార్యదర్ఫి బి.ఆర్‌.విూనా, న్యాయశాఖ కార్యదర్ఫి సంతోష్‌ రెడ్డి, స్టాంమ్స్‌ వ?నీ??. కమిషనర్‌ నదీమ్‌ అహ్మద్‌, ఎసిబి డిజి పూర్ణచందర్‌ రావు, ఇంటెలిజెన్స్‌ ఐజి నవీన్‌ చంద్‌, హైదరాబాద్‌ పోలీస్‌ కవిూషనర్‌ మహేందర్‌ రెడ్డి, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌ సుల్తానియూ, సిఎంట కార్యదర్పులు శాంతకుమారి, స్మితా సభర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ మొత్తం వ్యవహారంలో వెల్లడైన విషయాలు ఇలా ఉన్నాయి:

”మియాపూర్‌ లో 810 ఎకరాల ప్రభుత్వ భూమిపై ప్రైవేటు వ్యక్తులకు లిటిగేషన్‌ రైట్స్‌ కల్పిస్తూ సబ్‌ రిజిస్టేషన్‌ చేశారు. వాస్తవానికి ఇది భూమి బదలాయింపు (బితీజీనిబటవతీ నీట శ్రీజీనిట) రిజిస్టేషన్‌ కాదు. లిటిగేషన్‌ రైట్స్‌ కు సంబంధించిన రిజిస్టేషన్‌. ఒక వేళ అది భూ బదలాయింపు రిజిస్టేషనే అయితే, మొత్తం భూమి విలువకు రిజిస్టేషన్‌ చార్జి రూ. 415 కోట్లు అయ్యేది. కానీ ఈ రిజిస్టేషన్‌ కోసం రూ.60 లక్షలు కట్టారు. ఇది కూడా రిజిస్టేషన్‌ కోసం ఎంతో కొంత కట్టాలి తప్ప, ఈ చార్జి వేయడానికి ఏ ప్రాతిపదిక లేదు. ఇక ఈ భూమిని (ఎఎఎనీలజీపశ్రీవ జూతీనీజూవతీబివ) రిజిస్టేషన్‌ చేయాల్సి ఉంటుంది. అంటే భూమి 8.)ట్ఱవఙళీూ)ూనీÄఖిఆ బుక్‌ 1లో చేయాలి. కానీ ఇక్కడ చరాస్తి (ఓనీలజీపశ్రీవ జూతీనీజూవతీబివ) చేసే బుక్‌ 4లో రిజిష్టర్‌ చేశారు. కాబట్టి ఈ కు ఏమాత్రం విలువలేదు. ఎక్కడా చెల్లుబాటు కాదు. కొందరు వ్యక్తులు ఎప్పుడో రద్దయిన జాగీర్‌ భూములపై హక్కులు సంపాదించడానికి కోర్టులో కేసులు వేసి ఉన్నారు. సివిల్‌ కోర్టుల నుంచి హైకోర్టు వరకు ఎక్కడా వారి వాదన నెగ్గలేదు. దీంతో వారు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. ఆ కేసులో వాదనకు బలం చేకూరడానికి ఈ హక్కు పత్రాలు సంపాదించడానికి తప్పుడు రిజిస్టేషన్‌ చేయించుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించి తప్పుడు రిజిస్టేషన్‌ చేసిన అధికారిని, బాధ్యులపై చర్యలు తసుకున్నది. రిజిస్టేషన్లను రద్దు చేసింది. కాబట్టి మియాపూర్‌ భూముల విషయంలో ప్రభుత్వ ఖజానాకు ఒక్క రూపాయి కూడా నష్టం కలగలేదు. ఒక్క గజం స్థలం కూడా ఎవరి ఆధీనంలోకి పోలేదు. కోర్టు కేసుల్లో కూడా ప్రైవేటు వ్యక్తులకు బలం చేకూరే అవకాశం లేదు. ఇది ప్రభుత్వ భూమి అని నోటిపై చేస్తూ ఈ వివరాలను ప్రభుత్వం సబ్‌ రిజిస్టార్లకు పంపింది. అది తెలిసి కూడా సబ్‌ ఈ భూములను రిజిష్టర్‌ చేసినట్లు తేలింది. పూర్తిగా సబ్‌ చేసిన తప్పుగానే ఇది కనిపిస్తున్నది.”

‘ఇక బాలానగర్‌ సబ్‌ కార్యాలయంలో మియాపూర్‌ తో పాటు మరో ఏడు గ్రామాల భూములను ప్రైవేటు వ్యక్తులకు రిజిష్టర్‌ చేసిన వ్యవహారం కూడా ఇలాగే ఉంది. ఇక్కడ కూడా భూమి బదలాయింపు రిజిస్టేషన్‌ జరగలేదు. భూమిపై లిటిగేషన్‌ హక్కులకు జరిగింది. భూమి విలువ ప్రకారం కాకుండా, ఎంతో కొంత ఫీజు తీసుకోవాలనే ఉద్దేశ్యంతో సబ్‌ కేవలం రూ.8లక్షలు తీసుకుని భూములు చేశారు. ఇది కూడా బుక్‌ 1 (స్థిరాస్తి బదలాయింపు రిజిస్టేషన్‌)లో కాకుండా బుక్‌ 4(చరాస్తే బదలాయింపు రిజిస్టేషన్‌)లో చేశారు. ఈ డాక్యుమెంట్లలో మియాపూర్‌, మరియు 7 గ్రామాలు అని పేర్కొన్నారు తప్ప ఆ గ్రామాల పేర్లు రాయలేదు. ఎన్ని ఎకరాలో రాయలేదు. పైగా ఇవి కూడా ప్రభుత్వ భూములే కాబట్టి, ్న3? కూడా చెల్లదు. ఇక్కడ కూడా ప్రభుత్వ ఖజానాకు ఒక్క రూపాయి నష్టం జరగలేదు. ఒక్క గజం కూడా అన్యాక్రాంతం కాలేదు. విషయం తెలిసిన వెంటనే ఇక్కడ కూడా రిజిస్టేషన్లను ప్రభుత్వం రద్దు చేసింది. బాధ్యులపై చర్యలు తీసుకున్నది’పై రెండు ప్రాంతాల్లోనే కాకుండా, మిగతా చోట్ల జరిగిన వ్యవహారంపై కూడా పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వం అధికారులను జాగీరు భూములు రద్దయిప్పటికీ. ఇంకా వాటిపై హక్కులున్నాయని పత్రాలు సృష్టించుకోవడానికి కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని, వారికి కొందరు సబ్‌ రిజిస్టార్లు సహకరిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ సందర్భంగా అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎవరినీ ఉపేకించదని, ఎంతటి వారినైనా శిక్షించి తీరుతుందని సిఎం స్పష్టం చేశారు. జాగీరు భూములు రద్దయ్యాయని, వాటిపై ప్రభుత్వానికే తప్ప ప్రైవేటు వ్యక్తులకు ఎలాంటి హక్కులుండవని సిఎం స్పష్టం చేశారు. ఈ విషయంలో అవసరమైన న్యాయపోరాటం ?)ళీఅ:0 చేస్తామని వెల్లడించారు. ఒక్క గజం ప్రభుత్వ స్థలం కూడా పోకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదని సిఎం చెప్పారు.రిజిస్టేషన్లు జరిగే విధానంలోనే లోపముందని, ఈ వ్యవహారంలో ప్రక్షాళన జరగాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. మియాపూర్‌, తదితర ప్రాంతాల్లో జరిగిన అక్రమ రిజిస్టేషన్ల వ్యవహారం వెలుగు చూడకముందే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ విషయంపై దృష్టి పెట్టారు. ఇటీవల జరిగిన పరిణామాలను ఒక అవకాశంగా తీసుకుని రిజిస్టేషన్ల వ్యవహారంలో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తాజాగా అధికారులను ఆదేశించారు. దీనికోసం అవలంభించిన విధానాన్ని రూపొందించాలని కోరారు.జాగీర్‌ భూములపై హక్కు పత్రాలు సృష్టించుకుని ప్రభుత్వ భూములను కాజేయాలని చూసే ప్రయత్నాలను అన్ని కోణాల నుంచి ఎదుర్కోవాలని సిఎం చెప్పారు. సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన కేసులు నడుస్తున్నందున, రాష్ట్ర ప్రభుత్వం తరుఫున సుప్రీంకోర్టుకు పూర్తి వివరాలు అందించాలని సిఎం చెప్పారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే నేరుగా వివరాలు పంపి, కేసు విచారణ సందర్భంగా పూర్వాపరాలను పరిగణలోకి తీసుకునే విధంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.