సర్పంచ్‌లంతా గ్రామాల అభివృద్దికి పాటుపడాలి

మాజీ మంత్రి మహేందర్‌ రెడ్డి

వికారాబాద్‌,జనవరి22(జ‌నంసాక్షి): తాండూరు నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిచిన టీఆర్‌ సర్పంచ్‌ అభ్యర్థులను మాజీ మంత్రి మహేందర్‌ అభినందించారు. గెలుపు సాధించిన సర్పంచ్‌ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని మాజీ మంత్రి సూచించారు. రానున్న రోజుల్లో పంచాయతీలకు పెద్ద ఎత్తున ప్రభుత్వం అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయనుందన్నారు. ఈ నిధులను సద్వినియోగించుకుని కొత్త సర్పంచ్‌ గ్రామాల్లో వేగంగా అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకునాలని మాజీ మంత్రి సూచించారు. ప్రభుత్వం పంచాయతీల్లో మెరుగైన పాలన అందించేందుకు వచ్చే నెలలో రాష్ట్ర స్థాయిలో సర్పంచ్‌ పాలనలో ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్‌ ఈ శిక్షణ సదస్సులో హాజరవుతారని వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలే వచ్చే అన్ని రకాల ఎన్నికల్లో సాధించుకునేందుకు టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రతినిధులు కష్టించి పనిచేయాలని మహేందర్‌ రెడ్డి కోరారు. వచ్చే అన్ని ఎన్నికల్లో పార్టీ మరింత బలోపేతం అయ్యేలా చూడాలన్నారు. వచ్చే అన్ని ఎన్నికలతో పార్టీ మరింత బలోపేతమవుతుందని మాజీ మంత్రి అన్నారు. అలాగే జాతీయస్థాయిలో సిఎం కెసిర్‌ సత్తా చాటబోతున్నారని అన్నారు. ఊహించిన విధంగానే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు ఘన విజయం సాధించారని అన్నారు. రానున్న రోజుల్లో సహకార సంఘాలకు, మండ ప్రాదేశిక, నియోజకవర్గాలు, జడ్పీటీసీ స్థానాలకు, అలాగే మున్సిపల్‌ పాలక మండళ్లకు జరిగే ఎన్నికల్లో టీఆర్‌ ఇంకా మంచి ఫలితాలు సాధిస్తుందన్నారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో కూడా టీఆర్‌ ఘన విజ యం సాధిస్తుందన్నారు. ఇదే ఉత్సాహంతో ఎంపీ ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు. జిల్లాలో మొదటి విడుతగా తాండూరు, కొడంగల్‌ నియోజకవర్గాల్లో ని 215 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరిగితే దాదాపు 200 వరకు టీఆర్‌ పార్టీకి చెందిన సర్పంచ్‌ అభ్యర్థులే భారీ మె జార్టీతో గెలుపొందడం సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్‌ కొత్త పం చాయతీలను ఏర్పాటు చేయడంతో ప్రభుత్వంపై భరోసాతో చాలా మంది పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ పడ్డారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీఆర్‌ అభ్యర్థులను మంచి మెజార్టీతో గెలిపించాయన్నారు. తాండూరు నియోజకవర్గంలో మండలాల వారీగా 6 నుంచి 8 వేల మెజార్టీ పార్టీకి లభించిందని మాజీ మంత్రి వెల్లడించారు.