సర్పంచ్ సీటు..యమా హాట్ గురు..!

౼ సర్పంచ్ కు పోటాపోటీగా నామినేషన్లను
౼జాతరను తలపిస్తున్న నామినేషన్ కేంద్రాలు
౼గెలుపు కోసం ఎవరి ప్రయత్నాలు, వారికే
౼పల్లెల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు అభ్యర్థులు చక్కర్లు
౼కొన్నిచోట్ల రూ.15 నుంచి 20 లక్షల వరకైన రెడీ
౼ముగిసిన రెండోవిడత నామినేషన్ల పక్రియ

ఎల్లారెడ్డి-(జనంసాక్షి)-జనవరి-13
ఎల్లారెడ్డి:గ్రామపంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ అభ్యర్థులు ఖర్చులు వరదలైన పారనుందా అంటే పోటాపోటీగా నామినేషన్లు వేసిన అభ్యర్థులను చూస్తుంటే ఔననే అనిపిస్తుంది.కొన్ని చోట్ల నామినేషన్ల పర్వం మొదలుకుని పోలింగ్ తేది వరకు ఎన్నికల ఖర్చు రూ. లక్షలు కాదు రూ.15నుంచి 20 లక్షల పైన దాటినా ఆశ్చర్యం లేదంటున్నారు.మండలంలోని 31 పంచాయతీలో కొన్ని చోట్ల గ్రామపంచాయతీని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని సమాచారం.శుక్రవారం నుంచి రెండో విడత నామినేషన్ ప్రారంభంకాగా,మూడో రోజు ఆదివారం సాయంత్రం 5 గంటలకు నామినేషన్ పక్రియ పూర్తికాగా ఉపసంహరణల కోసం ఆశావహులు రూ.లక్షల్లో వెచ్చిస్తున్నారని ప్రచారం ఉంది.సర్పంచ్ గా ఎన్నికయ్యేందుకు అభ్యర్థులు తక్కువలో తక్కువగా రూ.20లక్షల వరకు పైగా ఖర్చులు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.మండలంలోని కొన్ని గ్రామపంచాయతీల్లో రూ.20లక్షల నుంచి 50 లక్షల వరకు తక్కువ కాకుండా ఖర్చులు చేయాల్సిన పరిస్థితితులు ఉన్నాయని అభ్యర్థులు స్వయంగా చెబుతున్నారు.
◆గెలుపే లక్ష్యంగా పావులు..
గ్రామపంచాయతీ ఎన్నికల్లో తమ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ నాయకులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు.మండలంల పరిధిలోని ఉదయం,సాయంత్రం వేళల్లో అన్ని గ్రామాల్లో ఎన్నికల సందడి కనిపిస్తోంది.ఓటర్లను తమవైపు తిప్ప కోవడానికి తెలిసిన వారితో సంప్రదింపులు జరుపుతు గెలుపు కోసం ప్రయత్నిస్తూన్నారు.ఎల్లారెడ్డి,లింగంపేట్,నాగిరెడ్డిపేట్,తాడ్వాయి,గాంధారి,నిజాంసాగర్, పిట్లం మండలాలలో రెండోవిడత నామినేషన్ల ఘట్టం ఆదివారంతో ముగియడంతో ప్రధాన పార్టీల నాయకులు రంగంలోకి దిగారు.ప్రతి గ్రామంలో ప్రతిగ్రామలంలో తక్కువ పోటీలు ఉండేలా జాగ్రత్తగా పడుతున్నారు.ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండని గ్రామాభివృద్ధికే ధ్వేయంగా పని చేస్తామని హామీలు గుప్పిస్తున్నారు.రెండోవిడత మండలంలోని 31 గ్రామపంచాయతీకి ఎన్నికలు జరుగుతున్నాయి.అయితే ఇక్కడ శాసనసభ ఎన్నికల్లో టీఆర్ ఎస్ ఓటమి చెంది మహాకూటమి నుంచి బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి నల్లమడుగు సురేందర్ గెలవడంతో, దింతో పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులు స్పీడ్ గా పనిచేస్తున్నారు.టీఆర్ ఎస్ నాయకులు అత్యధికంగా ఏకగ్రీవం చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం రూ.10 లక్షల నిధులను కేటాయించినప్పటికీ అభ్యర్థులు వాటి వైపు మొగ్గు చూపకుండా పోటీకి సై అంటునట్లు సమాచారం
◆సర్పంచ్ పదవి మీకు..ఉపసర్పంచ్ పదవి మాకు..
ఇంకొరకంగా చెప్పుకోవాలంటే సర్పంచ్ పదవి మీకు..ఉపసర్పంచ్ పదవి మాకు..అంటూ కొన్ని పంచాయతీలో ఒప్పందాలు చేసుకుంటున్నారు.పార్టీ గుర్తులు లేకుపోవడంతో సిద్ధాంతాలు,వైరుధ్యాలను పక్కన బెట్టి పరిస్థితులను అనుగుణంగా వ్యవహరిస్తున్నారు.ఈ సందర్భంగా విందులు,మందులు జోరీగా సాగుతున్నాయి.
★పదవుల పందేరం ఆఫర్లు..!
సర్పంచ్,ఉపసర్పంచ్ పదవులపై స్థానిక నేతలు చర్చోపచారచ్చలు,మరికొన్ని చోట్ల ఎంపీటీసీ,సొసైటీ డైరెక్టర్,చైర్మన్ ఆఫర్లతో ప్రాధాన్యం కల్పిస్తామని ఎరా వేస్తున్నారు.
★అభివృద్ధి మంత్రంతో ముందుకు..
పంచాయతీలకు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ద్వారా అభివృద్ధి జరుగుతుందనే ప్రచారంలో అధికార పార్టీ నాయకులు ముందుకు వెళ్తున్నారు.అత్యధిక గ్రామపంచాయతీలను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.మిగిలిన పార్టీల్లో కొన్ని గ్రామాల్లో ఆసక్తి చూపుతున్నారు.మరి కొన్ని గ్రామాల్లో ఆసక్తి చూపడం లేదు.దింతో ఈ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలు ఎత్తుకు పై ఎత్తులు వెళ్తుండడంతో రసవత్తరంగా మారాయి.