సామాజిక మాధ్యామాలపై చైతన్య కార్యక్రమం

కాలనీ వాసులకు డిసిపి ఉద్బోధ

మల్కాజిగిరి,మే25(జ‌నంసాక్షి): గత కొద్ది రోజులుగా నేరస్థులు, దొంగల ముఠా గల వ్యక్తులు తిరుగుతూన్నారని వాట్సాప్‌, ఫేస్బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు రావడంతో ప్రజలలో బయన్దోళనలు మొదలయ్యాయి. దీంతో గుర్తు తెలియని వ్యక్తులను దొంగలుగా భావించి వ్యక్తులని కొట్టడం, వ్యక్తులు చనిపోయిన సంఘటనలు వేరు వేరు ప్రదేశాలలో జరిగాయి. తెలంగాణ డీజీపీ స్థాయినుండి ప్రతి ఒక్కరు ప్రజలలో ఈ సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలు అపోహలు మాత్రమే అని పోలీసులు ఆవగాహన కార్యక్రమాలు ఏర్పాటుచేస్తున్నారు. అందులో భాగంగా మేడ్చల్‌ జిల్లా బోడుప్పల్‌ మున్సిపల్‌ పరిధి దేవేందర్‌ నగర్‌ లో మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ అద్వర్యంలో దొంగల ముఠా గురించి సామాజిక మాధ్యమంలో వచ్చే ప్రకటనలు అవాస్తవాలని, ప్రజలకు తెలియచేయుటకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ మాట్లాడుతూ ఇక్కడికి 7కాలనీల వాళ్ళు రావడం సంతోషమని, సోషల్‌ విూడియాలో వస్తున్న వార్తలు,వదంతులను నమ్మొద్దని, ఎవరైనా అనుమానితులు కనిపిస్తే 100కి కాల్‌ చేసి చెప్పాలని అన్నారు. చట్టాన్ని విూచేతుల్లోకి తీసుకొని ఇబ్బందులు పడొద్దని చెప్తూ, ఇక్కడి కాలనీల సమస్యలను తెలుసుసుకొని, కాలనీల ప్రజలతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో పోలీస్‌ అధికారులతో పాటు వివిధ కాలనీల ప్రజలు పాల్గొన్నారు