సామాన్యుడికి జిఎస్‌టి వల్ల ఒరిగేదేమిటి

ఒకే దేశం ఒకే పన్ను విధానం అమలులోకి వచ్చేందుకు జిఎస్‌టి ఉపకరిస్తుందంటున్న వారు దాని ప్రభావాలపైనా చర్చ చేయాలి. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఏ మేరకు ఇది ఉపయుక్తమో విశ్లేషించాలి. ఏ వస్తువు కొన్నా, ఏ ¬టల్‌కు వెళ్లి భోజనం చేద్దామన్నా వివిధ రకాల పన్నులు వాతలు పెడుతున్న కాలం ఇది. తిన్న పదార్థాలకు మించి పన్నులు వేస్తున్న తీరు చూస్తుంటే, సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇప్పటికే ¬టల్‌కు వెళ్లి టిఫఙన్‌ చేసే రోజులు పోయాయి. ప్రభుత్వం కేవలం పన్నులను వివిధ రూపాల్లో వసూలు చేసి ఎంజాయ్‌ చేస్తోంది. ప్రజలనుంచి ముక్కుపిండి పన్నుల రూపంలో వఞఔలు మొత్తాలను తమ ఇష్టం వచ్చినట్లుగా విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ దేశప్రజల హితాన్ని మరచి పోతున్నారు. కేవలం ఓట్లను గుంజే పథకాలకు వేలకోట్లు దోచిపెట్టే విషయంలోనూ రాజ్యాంగ సవరణలు రావాలి. అలా అయితే తప్ప దోచిపెట్టే పథకాలు మరుగున పడతాయి. ఉదాహరణకు కిలో రూపాయి బియ్యం గురించి చెబుతున్న వారు దానికి సొమ్ము ఎవడబ్బ సొమ్మో ఆలోచన చేయాలి. ఇలా వృధా పథకాలు అరికట్టి దేశాన్ని బలోపేతం చేసే నిర్మాణాత్మక పథకాలను చేపట్టాలి. హైదరాబాద్‌ లాంటి నగరాల్లో పన్నులు వసూళ్లు అవుతున్నా ప్రాథమిక సౌకర్యాలు కూడా ఉండవు. రోడ్లు బాగు లేకున్నా పట్టించుకోరు. ఇలాంటప్పుడు పన్నులన్నీ ఎక్కడ పోతున్నట్లు. జిఎస్టీ ఆమోదం పొందిందని చంకలు గుద్దుకుంటున్న వారు పన్నులు ఎగవేసే వారి గురించి ఆలోచించడం లేదు. మన దగ్గర ఉన్న డబ్బు వైట్‌గా చెలామణి చేయడమెలా ఆలోచించడం లేదు. బ్యాంకులకు వెళితే సవాలక్ష ఆంక్షలు ఉన్నాయన్న విషయాన్ని మరచిపోతున్నారు. ఇంటి రుణం పొందితే మూడింతలు చెల్లించడం ద్వారా మధ్యతరగతి ప్రజలు గుల్లవుతున్నారని గుర్తించడం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు ఉన్నా వాటిని చర్చించి జిఎస్టీలో పొందుపరచి ఉంటే బాగుండేది. పన్ను అనేది సులభతరంగా చెల్లించేదిగా ఉండాలి. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చెల్లించేలా ఉండాలి. కానీ జిఎస్టీ ఏ మేరకు ఇలాంటి హావిూ ఇస్తుందో చెప్పలేం. ప్రస్తుత పన్నుల వ్యవస్థలో అనేకానేక సంక్లిష్టతలకు, సమస్యలకు పరిష్కారం చూపగల ఏకైక సంస్కరణ అని రాజ్యసభలో చెప్పారు. 130కోట్లకుపైగా వినియోగదారులు కలిగిన రూ.134లక్షల కోట్ల భారత ఆర్థిక వ్యవస్థకు నూతన జీవౌషధంగా వస్తు సేవల పన్నును నిపుణులు అభివర్ణిస్తున్నారు. జీఎస్‌టీ రాకతో ఎనిమిది రకాల కేంద్ర పన్నులు, రాష్ట్ర స్థాయిలో ఆరు సుంకాలు కనుమరుగు కానున్నాయని చెబుతున్నారు. కానీ దాని విపరిణామాలు కూడా చెబుతున్నారు. దేశమంతటా ఒకేతరహా పరోక్ష పన్నుల వ్యవస్థ ప్రవేశపెట్టాలన్న యత్నంపట్ల ఇన్నాళ్లూ వివిధ రాష్టాల్రు అనుమానాలు వ్యక్తపరచాయి. రాబడి తరలిపోతుందన్న గుజరాత్‌, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్టాల్రు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు సగానికిపైగా రాష్టాల్రు రాజ్యాంగ సవరణకు శాసనసభల్లో చట్టం ఆమోదింపజేయాల్సి ఉంటుంది. కేంద్రస్థాయి జీఎస్‌టీ, అంతర్రాష్ట్ర జీఎస్‌టీలపై పార్లమెంటులో ఇంకో రెండు అనుబంధ శాసనాలు రూపుదిద్దుకోవాలి. అప్పుడుగాని కొత్త పన్ను అమలుకు నోచుకోదు. జీఎస్‌టీ అమలులోకి వస్తే పలు రకాల వస్తువుల ధరలు తగ్గుతాయని; స్థూల జాతీయోత్పత్తీ ఇనుమడిస్తుందని ప్రభుత్వం చెబుఉతన్న లేదా ఇస్తున్న హావిూ ఏ మేరకు అన్నది చూడాలి. వ్యాట్‌ అమల్లోకి వచ్చి సందర్భంలోనూ ఇలాంటి ప్రకటనలే చేశారు. కానీ దాని వల్ల నష్టం ఎక్కువన్నది అనుభపూర్వకంగా తెలుసుకోగలిగాం. రాజ్యాంగంలోని 246 అధికరణ ద్వారా ఇప్పటి వరకూ కేంద్రం, రాష్టాల్రు తమతమ పరిధిలో పన్నులు వసూలు చేసే చట్టాలను రూపొందించుకునేవి. ఇప్పుడు 122వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ నూతన పన్ను విధానం అమలులోకి వస్తుంది. లోక్‌సభ ఆమోదించిన బిల్లుకు ఇప్పుడు రాజ్యసభ ఆమోదించిన బిల్లుకు తేడాలు ఉన్నందున మళ్లీ జిఎస్‌టి బిల్లు లోక్‌సభ ఆమోదం పొందాల్సి ఉంటుంది. అయితే లోక్‌సభలో ఎన్‌డిఏ ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నందున ఈ బిల్లును మళ్లీ ఆమోదించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు. జిఎస్‌టి అమలులోకి వస్తే వినియోగదారుడికి మేలుకలిగే అంశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఇప్పటి వరకూ ఒక వస్తువు తయారై ఫ్యాక్టరీ నుంచి బయటకు రాగానే కేంద్ర ప్రభుత్వం పన్ను విధిస్తుంది. ఆ తర్వాత అది వినియోగ దారుడికి చేరినపుడు రాష్ట్రం పన్ను వసూలు చేస్తుంది. ఒక రాష్ట్రంలో తయారై మరో రాష్ట్రం దాటి ఇంకో రాష్ట్రంలో ఆ వస్తువు అమ్మితే మధ్యలో రాష్ట్రం ఎక్స్‌పోర్టు పన్ను వసూలు చేస్తుంది. జిఎస్‌టి అమలులోకి వస్తే ఒక వస్తువుపై తయారైనప్పటి నుంచి అమ్మే వరకూ ఒకే సారి పన్ను విధిస్తారు. రాష్టాల్ర మధ్య సరకు రవాణాపై కూడా పన్ను ఉండదంటున్నారు. దేశ పన్నుల వసూలు చరిత్రలోనే ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతుందని ఆర్థికవేత్తలు అంటున్నారు. ఎక్స్‌పోర్టు పన్ను విధించే అవకాశం ఉండకపోవడం వల్ల రాష్టాల్రకు కొంత ఆదాయం తగ్గుతుంది. జిఎస్‌టి అమలు వల్ల వస్తువులకు పన్నులు తగ్గే అవకాశం ఉన్నా సేవలకు మాత్రం పన్నులు పెరిగే అవకాశమే ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఏ రాష్ట్రం కూడా సేవలపై 15 శాతానికి మించి పన్ను వసూలు చేయడం లేదు. జిఎస్‌టిలో కనీసం 18 శాతం నుంచి 22 శాతం వరకూ ఉండే అవకాశం కనిపిస్తున్నందున సేవల భారం భారీగా పెరుగుతుంది. జీఎస్‌టీ అమల్లోకి వస్తే అనేక వస్తువుల ధరలు 2 శాతం మేరకు తగ్గుతాయని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు. పన్నుల వసూళ్లన్నీ కంప్యూటర్‌ ద్వారా జరగనున్నందువల్ల దేశవ్యాప్తంగా దాదాపు కోటి ఉద్యోగాలు కొత్తగా లభిస్తాయని అంచనా. అయితే దీనిపైనా కసరత్తు చేసి ప్రజలకు ఇది మేలు చేస్తుందా లేదా అన్నది ఆలోచనచేయాలి. ధరలు పెరిగినా పట్టించుకోని విధంగా ఉంటే ఏ బిల్లు వచ్చిన ప్రజలకు ఒరిగేదేవిూ ఉండదని గుర్తుంచుకోవాలి.